realme launching Realme C85 5G with big battery
రియల్ మీ బడ్జెట్ సిరీస్ నుంచి Realme C85 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ గురించి అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ అప్ కమింగ్ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా రియల్ మీ విడుదల చేసింది. ఈ టీజర్ ఇమేజెస్ ద్వారా ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరాబిలిటీ కలిగిన డిజైన్ మరియు 7000 mAh బిగ్ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అవుతున్నట్లు కన్ఫర్మ్ చేసింది.
రియల్ మీ సి85 5జి స్మార్ట్ ఫోన్ నవంబర్ 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ అందించింది.
Also Read: OnePlus 15R మరియు Pad Go 2 ఇండియా లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన కంపెనీ.!
రియల్ మీ యొక్క ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ SGS మిలటరీ గ్రేడ్ MIL-STD 810H డ్యూరాబిలిటీ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది చాలా సన్నని డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన బిగ్ డిస్ప్లే తో ఉంటుంది. ఈ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కలిగిన ఈ పెద్ద బ్యాటరీతో 22 గంటల వీడియో స్ట్రీమింగ్ లేదా 50 గంటల కాలింగ్ లేదా 145 గంటల మ్యూజిక్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది. కేవలం ఛార్జ్ మాత్రమే కాదు ఈ ఫోన్ లో 6.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది.
ఈ ఫోన్ ఈ సిరీస్ లో బెస్ట్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. ఎందుకంటే, ఈ ఫోన్ ను IP 69 ప్రో రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో లాంచ్ చేస్తోంది. రియల్ మీ సి85 5జి స్మార్ట్ ఫోన్ లో 50MP Sony అబుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో AI ఎడిట్ Gene ఫీచర్ కూడా ఉంటుంది. ఇవి కాకుండా రియల్ మీ సి85 5జి స్మార్ట్ ఫోన్ లో మంచి నెట్వర్క్ కోసం మరింత పెంచిన సిగ్నల్ శక్తి మరియు 400 శాతం లౌడ్ సౌండ్ అందించే స్పీకర్ ఉన్నట్లు కూడా రియల్ మీ వెల్లడించింది.