రియల్ మీ యొక్క బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గా పేరుపొందిన C-సిరీస్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తోంది. అదే, Realme C31 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను ప్రీమియం లుక్స్ తో తీసుకు వస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ ఇమేజ్ చూస్తుంటేనే అర్ధం అవుతోంది. ఈ ఫోన్ యొక్క కొన్ని స్పెక్స్ ను కూడ టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ ను Flipakrt ప్రత్యేకంగా తీసుకువస్తోంది కావచ్చు. ఎందుకంటే, రియల్ మీ సి 31 కోసం ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. ఈ ఫోన్ రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు ఇండియాలో విడుదల అవుతుంది.
రియల్ మీ సి 31 యొక్క కొన్ని వివరాలను టీజింగ్ ద్వారా రియల్ మీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ డిస్ప్లేని 88.7% స్క్రీన్ టూ బాడీ రేషియోతో తో కలిగి వుంటుంది. ఈ స్క్రీన్ పైన 16.7M కలర్స్ ని ఎంజాయ్ చెయ్యవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ కేవలం 8.4mm మందంతో సన్నని డిజైన్ తో కూడా ఉంటుంది. ముఖ్యంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో అందించిన కెమెరా సెటప్ డిజైన్ ఆకట్టుకుంటోంది. ఈ ఆకర్షణీయమైన డిజైన్ లో 13MP AI ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది.
మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, Realme C31 స్మార్ట్ ఫోన్ పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇందులో ఉన్న అల్ట్రా సేవింగ్ మోడ్ తో బ్యాటరీని మరింత సేవ్ చేయవచ్చని రియల్ మీ చెబుతోంది. సెక్యూరిటీ పరంగా, ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నట్లు నిర్ధారించింది.