ఇప్పటికే Realme 8 సిరీస్ స్మార్ట్ ఫోన్ల గురించి అంచనాలు పెరిగాయి. రియల్మీ 8 సిరీస్ నుండి రియల్మీ 8 మరియు 8 ప్రో స్మార్ట్ ఫోన్లను విడుదల చెయ్యనున్నట్లు ఇప్పటికే కంపెనీ ప్రకటించింది. అంతేకాదు, ఈ 108MP కెమెరాతో పాటుగా Super AMOLED డిస్ప్లే మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి చాలా హై ఎండ్ ఫీచరాలను గురించి టీజ్ చేస్తోంది. ఈరోజు సాయంత్రం లాంచ్ ఈవెంట్ నుండి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెషిఫికేషన్లు మరియు ధర ప్రకటించబడతాయి.
అయితే, రియల్మీ 8 సిరీస్ గురించి ఇప్పటికే చాలా రూమర్లు మరియు లీక్స్ ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. కానీ, అధికారిక ప్రకటన ద్వారా 108MP కెమెరాతో ఈ ఫోన్లను తీసుకొస్తున్నట్లు తేటతెల్లమయ్యింది. అలాగే, రియల్మీ సీఈవో మాధవ్ సేథ్ యూట్యూబ్ లో విడుదల చేసిన వీడియో ద్వారా రియల్మీ 8 స్మార్ట్ ఫోన్ లో 64MP మైన్ కెమెరా మరియు రియల్మీ 8 ప్రో ఫోన్ లో 108MP ప్రధాన కెమెరా సెటప్పుతో వుంటుందని అర్ధమవుతోంది.
ఇక ఈ ఫోన్ల గురించి ముందుగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, రియల్మీ 8 ఒక 6.4 అంగుళాల AMOLED ప్యానల్ తో, 64ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్ మరియు మీడియా టెక్ హీలియో G95 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే, పెద్ద 5000mAh బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకువస్తుందని చెప్పబడుతోంది.
అయితే, 8 ప్రో మోడల్ మాత్రం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన పెద్ద సూపర్ AMOLED స్క్రీన్ 108MP కెమెరా స్నాప్ డ్రాగన్ 720G ప్రాసెసర్ మరియు మరిన్ని లేటెస్ట్ ఫీచర్లతో ప్రకటించవచ్చని ఆశిస్తున్నారు.