Realme 9 Pro Series 5G: లేటెస్ట్ Sony కెమెరాతో రేపు విడుదలకానుంది

HIGHLIGHTS

Realme 9 Pro Series 5G స్మార్ట్ ఫోన్స్ ను రేపు ఇండియాలో విడుదల చేస్తోంది

50MP SonyIMX 766 సెన్సార్ మరియు OIS సపోర్ట్

Dimensity 920 5G ప్రాసెసర్ మరియు హార్ట్ రేట్ సెన్సార్ సపోర్ట్

Realme చాలా కాలంగా టీజ్ చేస్తూ వస్తున్న 9 Pro Series 5G  స్మార్ట్ ఫోన్స్ ను రేపు ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ లాంచ్ కార్యక్రమాన్ని Realme అధికారిక Youtube ఛానల్ నుండి LIVE చూడవచ్చు. ఈ  రియల్ మి తీసుకొస్తున్న ఈ సిరీస్ యొక్క చాలా ఫీచర్లను ఇప్పటికే టీజింగ్ మరియు ఆన్లైన్ లీక్స్ ద్వారా వెల్లడించింది. ఈ సిరీస్ నుండి తీసుకువస్తున్న Realme 9 Pro+ స్మార్ట్ ఫోన్  SonyIMX 766 సెన్సార్ ను OIS సపోర్ట్ తో మరియు Dimensity 920 5G ప్రాసెసర్ తో తీసుకువస్తునట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

అంతేకాదు, ఈ సిరీస్ గురించి కంపెనీ ఇటీవల కంపెనీ CEO మాధవ్ సేథ్ చేసిన ట్వీట్ ద్వారా Realme 9 Pro+ 5G స్మార్ట్ ఫోన్ హార్ట్ రేట్ సెన్సార్ తో వస్తున్నట్లు కూడా వెల్లడయ్యింది. వీటిని బట్టి చూస్తుంటే Realme 9 Pro + భారీ ఫీచర్లతో మార్కెట్లో అడుగుపెట్టేలా కనిపిస్తోంది.  

Realme 9 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుందని, ఇది హార్ట్ రేట్ ను స్కానర్ కూడా పనిచేస్తుందని మాధవ్ సేథ్ ధ్రువీకరించారు. దీనికోసం, వినియోగదారులు వారి వేలును స్కానర్ పైన నొక్కిపట్టి ఉంచిన తరువాత రీడింగ్స్ ని స్క్రీన్ పైన చూడవచ్చని తెలిపారు.

ఇక Realme 9 Pro+ మరిన్ని వివరాల కోసం చూస్తే, ఇందులో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 119-డిగ్రీ FOVతో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందువైపు 16MP సెల్ఫీ కెమెరా ఉంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన ప్రసరించే లైట్ ను బట్టి రంగులు మార్చేలా సరికొత్త లైట్ షిఫ్టింగ్ డిజైన్ ను కూడా ఈ ఫోన్ లో అందించింది. Realme 9 Pro+ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,500mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :