200MP Periscope కెమేరాతో కొత్త ఫోన్ ఫోన్ లాంచ్ చేస్తున్న Realme.!

HIGHLIGHTS

భారత మార్కెట్ లో Realme కొత్త ఫోన్ లాంచ్ ప్రస్తావన

200MP Periscope కెమేరాతో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న రియల్ మి

అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తో అదరగొట్టే టీజింగ్ ను అందించింది

ప్రముఖ మొబైల్ బ్రాండ్ Realme భారత మార్కెట్ లో కొత్త ఫోన్ లాంచ్ ప్రస్తావన 200MP Periscope కెమేరాతో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ పేరు ఇంకా ప్రకటించనప్పటికీ , ఈ అప్ కమింగ్ ఫోన్ ఫీచర్ తో టీజింగ్ మాత్రం మొదలు పెట్టింది. రియల్ మి ఇప్పటికే అన్ని సెగ్మెంట్ లలో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసి భారత మార్కెట్ లో తనదైన బ్రాండ్ పేరును తెచ్చుకుంది. అయితే, ఇప్పుడు ప్రీమియం ఫీచర్లతో కూడా ఫోన్ లను విడుదల చేయడానికి సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ రియల్ మి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

Realme 200MP Periscope Camera Phone

రియల్ మి అప్ కమింగ్ ఫోన్ లాంచ్ గురించి టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ పేరు లేదా లాంచ్ డేట్ వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించ లేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తో అదరగొట్టే టీజింగ్ ను మాత్రం అందించింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా తీసుకు వస్తోంది కాబోలు, అందుకే ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజ్ ను అందించింది.

రియల్ మీ వెబ్సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ మైక్రో సైట్ పేజ్ నుండి ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం అందించిన వివరాల ద్వారా కొత్త కెమేరా సెటప్ ఉన్నట్లు తెలుస్తోంది. రియల్ మీ ఈ ఫోన్ ను 200MP పెరిస్కోప్ సెన్సార్ తో కూడిన కెమేరా సెటప్ తో తీసుకు వస్తున్నట్లు తెలిపింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ తో తీసిన శాంపిల్ ఫోటోలతో టీజింగ్ చేస్తోంది రియల్ మి.

Also Read : భారీ ఆఫర్లతో Great Republic Day Sale 2024 ప్రకటించిన అమేజాన్.!

ఈ ఫోన్ యొక్క మరే ఇతర ఫీచర్లను కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించ లేదు. అయితే, అప్ కమింగ్ రియల్ మి ఫోన్ పెరిస్కోప్ కెమేరా గురించి మాత్రం చాలా గొప్పగా చెబుతోంది. టీజర్ ఫోటోలను చూస్తుంటే, ఈ ఫోన్ అద్భుతమైన ఫోటోలను చిత్రీకరించ గలిగే సత్తాను కలిగి ఉంటుందేమో అనిపిస్తోంది.

అయితే, ఇవన్నీ కూడా మనం వేసుకుంటున్న అంచనాలే సుమండీ! ఈ ఫోన్ లాంచ్ కావడానికి మరింత సమయం ఉన్నది కాబట్టి ఈ ఫోన్ మొక్క మరిన్ని స్పెక్స్ మరియు ఫీచర్లను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :