ఇండియాలో విడుదలకు సిద్ధమైన Realme 200MP కెమేరా ఫోన్.!
ఈరోజు ఇండియాలో Narzo సిరీస్ నుండి కొత్త ఫోన్ విడుదల చేసిన రియల్ మి
అప్ కమింగ్ ఫోన్ గురించి కూడా అప్డేట్ ను అందించింది
Realme 11 Pro Series 5G ను ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది
ఈరోజు ఇండియాలో Narzo సిరీస్ నుండి కొత్త ఫోన్ విడుదల చేసిన రియల్ మి, మరొక అప్ కమింగ్ ఫోన్ గురించి కూడా అప్డేట్ ను అందించింది. చైనాలో ఇటీవల విడుదల చేసిన Realme 11 Pro Series 5G ను ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. రియల్ మి 11 ప్రో సిరీస్ 5G ఫోన్స్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ ముచ్చట్లు ఏమిటో చూద్దాం పదండి.
SurveyRealme 11 Pro Series 5G
రియల్ మి 11 ప్రో సిరీస్ 5G యొక్క టీజింగ్ లో భాగంగా కెమేరా ని గురించి టీజింగ్ మొదలు పెట్టింది. అయితే, ఈ కెమేరా వివరాలు చైనాలో విడుదలైన రియల్ మి 11 ప్రో సిరీస్ 5G లో హై ఎండ్ ఫోన్ రియల్ మి 11 ప్రో+ 5G కెమేరాని పోలి ఉన్నాయి. అంటే, ఇండియాలో అదే సిరీస్ ఫోన్లను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. అయితే, రియల్ మి నుండి ఈ విషయం పైన ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.
ఈ ఫోన్లను త్వరలోనే లాంచ్ చేస్తునట్టు కంపెనీ ప్రకటించింది. కానీ, ఈ Realme 11 Pro Series 5G లాంచ్ డేట్ ని మాత్రం ఇంకా వెల్లడించ లేదు. అంటే, కంపెనీ ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలు మరియు ప్రత్యేకతలతో టీజింగ్ ను కొనసాగిస్తుందని అర్ధం చేసుకోవచ్చు.
Get ready to witness the next level of 200MP!
We're unleashing the beast soon. Stay tuned! #realmeNumberSeriesKnow more: https://t.co/OEfTLTiwgy pic.twitter.com/Rxa5NLqr3H
— realme (@realmeIndia) May 16, 2023
Realme 11 Pro+ 5G (చైనా వేరియంట్): స్పెక్స్
రియల్ మి 11 ప్రో+ చైనా వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, లెదర్ డిజైన్, Dimensity 7050 SoC, 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ సపోర్ట్, 67W ఫాస్ట్ ఛార్జింగ్ బిగ్ బ్యాటరీ మరియు 200MP ట్రిపుల్ కెమేరా సిస్టం వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile