రియల్ మీ ఈరోజు ఇండియాలో GT నియో 3 నుండి కొత్త Thor ఎడిషన్ ను విడుదల చేసింది. అదే, Realme GT Neo 3 Thor: Love and Thunder Limited Edition మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను అత్యంత వేగవంతమైన 150W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో అందించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ను Marvel స్టూడియోస్ సహకారంతో రూపొందించింది మరియు ఈ రోజు థోర్: లవ్ అండ్ థండర్ సినిమా రిలీజ్ సందర్భంగా ఇదే రోజున విడుదల చేసింది. మరి ఈ కొత్త మార్వెల్ ఎడిషన్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ వివరాల పైన ఒక లుక్ వేద్దామా.
రియల్‌మీ జిటి నియో 3 థోర్: లవ్ అండ్ థండర్ ఎడిషన్ కేవలం 12 GB RAM మరియు 256 GB ROM వేరియంట్ తో వస్తుంది మరియు దీని ధర రూ.42,999. ఇది సరికొత్త నైట్రో బ్లూ కలర్‌లో వస్తుంది. ఈరోజు నుండి ఈ ఫోన్ రియల్ మీ అదిఆకృక వెబ్సైట్ నుండి Pre-Orders కి అందుబాటులో వుంది. ఈ ఫోన్ జూలై 13 నుండి Flipkart మరియు Realme.com నుండి కొనుగోలుకు ఉపలబ్ధమవుతుంది.
రియల్‌మీ జిటి నియో 3 థోర్: లవ్ అండ్ థండర్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ FHD+ OLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది మరియు ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ డిస్‌ప్లే కోసం డేడికేటెడ్ డిస్ప్లే సెన్సార్ ని కూడా అందించింది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8100 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా Realme UI 3.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP SonyIMX766 మైన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ వేగవంతమైన 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 బ్యాటరీతో వచ్చింది.
ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, వేగవంతమైన ఛార్జింగ్, కొత్త కలర్ మరియు కొన్ని ఇన్-బాక్స్ గిఫ్ట్ వంటి వాటిని మాత్రమే వినియోగదారులు అందుకుంటారు. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ప్యానెల్ లో ప్రత్యేక డిజైన్ లేదా Thor లేదా మార్వెల్ బ్యాగ్రౌండ్ UI కూడా ఉండదు.