రియల్ మీ నుండి వచ్చిన మరొక బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్..!

HIGHLIGHTS

రియల్ మీ ఇండియాలో మరొక బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది

Realme 9i 5G స్మార్ట్ ఫోన్ గొప్ప ఫీచర్లతో వచ్చింది

ఈ ఫోన్ డిజైన్ ను పాత SD మాదిరిగా లేజర్ లైట్ డిజైన్ తో అందించింది

రియల్ మీ ఇండియాలో మరొక బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. అదే, Realme 9i 5G  స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను గొప్ప ఫీచర్లతో పాటుగా మంచి లాంచ్ ఆఫర్లతో కూడా విడుదల చేయడం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.14,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేయ్యబడింది. ముఖ్యంగా ఈ ఫోన్ డిజైన్ ను పాత SD మాదిరిగా లేజర్ లైట్ డిజైన్ తో అందించింది. అలాగే, మీడియాటెక్ 5G ప్రాసెసర్, 90Hz రిఫ్రెష్ రేట్ FHD+ డిస్ప్లే మరియు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి.  

Realme 9i 5G: ధర మరియు ఆఫర్లు

రియల్ మీ 9i 5G రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు ICICI బ్యాంక్ అఫర్ తో వచ్చింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ మరియు EMI అప్షన్ తో కొనేవారికి 1,000 రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వేరియట్ల ధరలు క్రింద అందించబడ్డాయి.

1. Realme 9i 5G(4GB + 64GB) : ధర రూ.14,999/-

2.  Realme 9i 5G(6GB  + 128GB) : ధర రూ.16,999/-

ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు realme.com నుండి ఆగష్టు 24న మధ్యాహ్నం 12 గంటలకి మొదటిసారి సేల్ కి వస్తుంది.

Realme 9i 5G: స్పెక్స్

రియల్ మీ 9i 5G స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180 Hz టచ్ శాంప్లింగ్ కలిగి వుంటుంది. ఈ ఫోన్ 8.1 mm మందంతో సన్నని మరియు లేజర్ లైట్ డిజైన్ తో కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ రాకింగ్ బ్లాక్ మరియు మెటాలికా గోల్డ్ అనే రెండు కలర్ లలో లభిస్తుంది.     

ఇక కెమెరాల విషయానికి వస్తే, Realme 9i స్మార్ట్ ఫోన్ వెనుక ఆకర్షణీయమైన డిజైన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP మైన్ కెమెరాకి జతగా 2MP పోర్ట్రైట్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. అలాగే, సెల్ఫీల కోసం 8MP AI సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది.

సెక్యూరిటీ పరంగా, ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది మరియు ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా Realme UI 3.0 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :