రియల్‌మీ ఈరోజు చైనాలో Realme GT Neo 3 స్మార్ట్ ఫోన్ ప్రకటించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ తో ప్రకటించింది. ఎంత స్పీడ్ అంటే, కేవలం 5 నిముషాల్లోనే ఫోన్ 50% ఛార్జింగ్ అవుతుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఇటీవల షియోమీ ప్రకటించిన 11i హైపర్ ఛార్జ్ ఇప్పటి వరకూ మార్కెట్లో అత్యంత వేగవతమైన ఛార్జింగ్ ఫోన్ గా ఉండగా, ఇప్పుడు రియల్ మీ తన GT 3 Neo స్మార్ట్ ఫోన్ ను 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో విడుదల చేసి ఆ స్థానాన్ని చేజిక్కించుకుంది. కేవలం ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే కాదు ఇంకా చాలా ఫీచర్లు కూడా ఉన్నాయి.
రియల్‌మీ జిటి నియో 3 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది మరియు ఈ డిస్ప్లే 1000 Hz టచ్ శాంప్లింగ్ తో వస్తుంది. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8100 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా Realme UI 3.0 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP SonyIMX766 మైన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ అత్యంత వేగవంతమైన 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500 బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ కేవలం 5 నిముషాల్లోనే 50% ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.
చైనాలో ఈ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ (8GB/256GB) ధర CNY 2,599 (సుమారు రూ. 31,100) మరియు రెండవ వేరియంట్ (12GB/256GB) ధర CNY 2,799 (సుమారు రూ. 33,500).