అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ లభిస్తున్న Realme GT Neo 3T స్మార్ట్ ఫోన్.!

HIGHLIGHTS

Realme GT Neo 3T స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మీకు మిడ్ రేంజ్ ధరలో లభిస్తుంది

Amazon నుండి అందుబాటులో వున్న ఈ బెస్ట్ ఆఫర్ పైన ఒక లుక్కేద్దామా

Realme GT Neo 3T స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. రేసింగ్ ఫ్లాగ్ డిజైన్ మరియు స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్ తో పాటుగా 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మీకు మిడ్ రేంజ్ ధరలో లభిస్తుంది. అంతేకాదు, బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో మరింత తక్కువ ధరకే అందుకునే అవకాశం కూడా వుంది. Amazon నుండి అందుబాటులో వున్న ఈ బెస్ట్ ఆఫర్ పైన ఒక లుక్కేద్దామా.       

Realme GT Neo 3T 80W: ధర

Realme GT Neo 3T 80W స్టార్టింగ్ వేరియంట్ (6GB + 128GB) రూ.29,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, అమెజాన్ నుండి ఈరోజు 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ.26,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను Kotak బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి 10 % అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here    

Realme GT Neo 3T 80W: స్పెక్స్

రియల్‌మీ జిటి నియో 3టి 80W స్మార్ట్ ఫోన్ 6.62 ఇంచ్ FHD+ E4 AMOLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది మరియు ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా Realme UI 3.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగివుంది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 64MP మైన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ వేగవంతమైన 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 బ్యాటరీతో వచ్చింది. ఈ ఛార్జింగ్ టెక్ తో కేవలం 12 నిముషాల్లోనే 50% ఛార్జ్ చెయ్యగలదని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ Dolby Atmos మరియు Hi-res సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :