Flipkart ధమాకా అఫర్: రియల్ మి GT నియో 3T పైన భారీ డిస్కౌంట్ అందుకోండి.!
Flipkart ఈ సమ్మర్ 2023 సందర్భంగా Big Saving Days సేల్ తెచ్చింది
సేల్ కంటే ముందే భారీ స్మార్ట్ ఫోన్ డీల్ ను అఫర్ చేస్తోంది
రియల్ మి GT నియో 3T ను భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో పొందండి
Flipkart ఈ సమ్మర్ 2023 సందర్భంగా Big Saving Days సేల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 4వ తేదీ నుండి మొదలవుతుంది. అయితే, ఈ సేల్ కంటే ముందే భారీ స్మార్ట్ ఫోన్ డీల్ ను అఫర్ చేస్తోంది. భారీ ఫీచర్లు కలిగిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ రియల్ మి GT నియో 3T ను భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో పొందడానికి చూస్తున్న వారికి ఇది సదవకాశం కావచ్చు.
SurveyRealme GT Neo 3T: ధర & ఆఫర్స్
Realme GT Neo 3T స్మార్ట్ ఫోన్ గత సంవత్సరం చివరిలో ఇండియన్ మార్కెట్ లో రూ.29,999 రూపాయల స్టార్టింగ్ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ రూ. 10,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 19,999 అఫర్ ధరకే లభిస్తోంది. అతి తక్కువ EMI అఫర్ తో కూడా కినుగోలు చేసే వీలుంది.
Realme GT Neo 3T: ప్రత్యేకతలు
GT సిరీస్ నుండి వచ్చిన ఈ Realme GT Neo 3T స్మార్ట్ ఫోన్ లో 5,000mAh బిగ్ బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 870 ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు 6GB సపోర్ట్ తో వస్తుంది. ఈ రియల్ మి ఫోన్ 6.62 ఇంచ్ AMOLED E4 డిస్ప్లేని FHD+ రిజల్యూషన్, 1300 పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ వంటి ఫీచర్లతో కలిగి వుంది. ఈ ఫోన్ లో మీకు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది.
కెమేరాల పరంగా, ఈ ఫోన్ AI పవర్డ్ 64MP ట్రిపుల్ రియర్ కెమెరాని కలిగి వుంది. ఈ ఫోన్ రియర్ కెమేరాతో 4K వీడియో లను 30/60 fps వద్ద షూట్ చేయవచ్చు. ముందు Sony IMX471 సెల్ఫీ కెమేరాతో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ రియల్ మి యొక్క Realme UI 3.0 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile