Realme GT Neo 3 ఈరోజు ఇండియాలో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 80W మరియు 150W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన వేరియంట్స్ తో అందించింది. వీటిలో 150W ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్ కేవలం 5 నిముషాల్లోనే 50% వరకూ ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. అలాగే, ఈ ఫోన్ల ధరల్లో కూడా వేరియంట్ ను బట్టి అంతరాలు ఉంటాయి. రియల్ మీ లేటెస్ట్ గా తీసుకువచ్చిన ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గురించి వివరంగా చర్చిద్దాం.
రియల్‌మీ జిటి నియో 3 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ FHD+ OLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది మరియు ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ డిస్‌ప్లే కోసం డేడికేటెడ్ డిస్ప్లే సెన్సార్ ని కూడా అందించింది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8100 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా Realme UI 3.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP SonyIMX766 మైన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ వేగవంతమైన 80W /150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 బ్యాటరీతో వచ్చింది.
Realme GT Neo 3 5G (80W) స్టార్టింగ్ వేరియంట్ (8GB + 128GB) ధర రూ.36,999 గా నిర్ణయించింది. అయితే, (8GB + 256GB) వేరియంట్ ధర రూ.38,999 కాగా, హై ఎండ్ వేరియంట్ GT Neo 3 150W వేరియంట్ (12GB + 256GB) మెమరీతో రూ.42,999 ధరతో మార్కెట్లో ప్రవేశించింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌ల పైన పరిమిత కాలానికి పరిమితం చేసిన లాంచ్ ఆఫర్ లలో భాగంగా కంపెనీ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ మే 04 మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.