Realme GT 6T : భారీ ఫీచర్లతో సర్ప్రైజింగ్ ధరలో వచ్చింది.!

Updated on 22-May-2024
HIGHLIGHTS

రియల్ మీ ఈరోజు భారత మార్కెట్లో Realme GT 6T ను విడుదల చేసింది

6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన డిస్ప్లే వంటి మరిన్ని భారీ ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ తో అద్భుతమైన లాంచ్ ఆఫర్లను కూడా రియల్ మీ అందించింది

Realme GT 6T : రియల్ మీ ఈరోజు భారత మార్కెట్లో కొత్త రియల్ మీ GT 6T ఫోన్ ను విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను Snapdragon 7+ Gen 3 ప్రోసెసర్ మరియు 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన డిస్ప్లే వంటి మరిన్ని భారీ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ తో అద్భుతమైన లాంచ్ ఆఫర్లను కూడా రియల్ మీ అందించింది. ఈరోజే సరికొత్తగా మార్కెట్ లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.

Realme GT 6T : Price

రియల్ మీ GT 6T స్మార్ట్ ఫోన్ ను నాలుగు వేరియంట్లలో విడుదల చేసింది.ఈ నాలుగు వేరియంట్ ధర లను ఈ క్రింద చూడవచ్చు.

రియల్ మీ GT 6T (8GB + 128GB) ధర : రూ. 30,999

రియల్ మీ GT 6T (8GB + 256GB) ధర : రూ. 32,999

రియల్ మీ GT 6T (12GB + 256GB) ధర : రూ. 35,999

రియల్ మీ GT 6T (12GB + 512GB) ధర : రూ. 39,999

ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మే 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలవుతుంది. ఈ ఫోన్ Amazon మరియు realme.com నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

ఆఫర్స్

ఈ ఫోన్ పైన గొప్ప ఆఫర్లను కూడా రియల్ మీ అందించింది. ఈ ఫోన్ పైన రూ. 4000 రూపాయల ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ ICICI, HDFC మరియు SBI బ్యాంక్ క్రెడిట్ / డెడిట్ మరియు EMI ఆప్షన్ తో ఈ ఫోన్ కొనే వారికి వర్తిస్తుంది.

Realme GT 6T Offers

అంతేకాదు, ఈ ఫోన్ ఎక్స్ చేంజ్ పైన రూ. 2000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా రియల్ మీ అందించింది.

Also Read: 1 కోటికి పైగా SIM Card లను బ్లాక్ చేసిన ప్రభుత్వం: రిపోర్ట్

Realme GT 6T : ఫీచర్స్

రియల్ మీ ఈ ఫోన్ ను 6000 నిట్స్ పీక్ అల్ట్రా బ్రైట్నెస్ మరియు అల్ట్రా డ్రాప్ ప్రొటెక్షన్ కలిగిన 6.78 ఇంచ్ 8T LTPO డిస్ప్లేతో వచ్చింది. ఈ డిస్ప్లే 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 7+ Gen 3 చిప్ సెట్ మరియు జతగా 12GB RAM తో వస్తుంది. ఈ ఫోన్ లో గరిష్టంగా 512GB హెవీస్ స్టోరేజ్ సపోర్ట్ కూడా వుంది.

Realme GT 6T Features

రియల్ మీ GT 6T స్మార్ట్ ఫోన్ 50MP LYT-600 మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరాతో ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో 5500 హెవీ బ్యాటరీ మరియు 120Hz సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా వుంది.

ఇక ఈ ఫోన్ లో అందించిన ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ లో ఎయిర్ జెశ్చర్, NFC సెక్యూరిటీ చిప్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ ఫోన్ Realme UI 5.0 సాఫ్ట్ వేర్ పైన Android 14OS తో నడుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :
Tags: tech news