భారీ ఆఫర్ తో Realme GT 2 Pro ఫస్ట్ సేల్ ..!!

Updated on 12-Apr-2022
HIGHLIGHTS

Realme GT 2 Pro మొదటిసారిగా అమ్మకానికి రాబోతోంది

రియల్‌మీ జిటి 2 ప్రో అద్భుతమైన డిజైన్ మరియు భారీ ఫీచర్లతో వచ్చింది

ఈ ఫోన్ కొనేవారికి 5,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ అఫర్ ను అందించింది

రియల్ మీ ఇండియాలో భారీ ఫీచర్లతో ప్రవేశపెట్టిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ Realme GT 2 Pro మొదటిసారిగా అమ్మకానికి రాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ చాలా ఫీచర్లను మొదటిసారిగా పరిచయం చేసింది మరియు అద్భుతమైన డిజైన్ మరియు భారీ ఫీచర్లతో వచ్చింది. రియల్‌మీ జిటి 2 ప్రో స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 14 నుండి అమ్మకానికి వస్తుంది.ఈ ఫోన్ పైన SBI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డుతో ఈ ఫోన్ కొనేవారికి 5,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ అఫర్ ను అందించింది. GT2 Pro స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 2K రిజల్యూషన్ డిస్ప్లే మరియు బెస్ట్ కెమెరా సిస్టం వంటి చాలా గొప్ప ఫీచర్లను కలిగివుంటుంది.

Realme GT 2 Pro: ధర

రియల్‌మీ జిటి 2 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ.49,999 రూపాయల ప్రారంభ ధరతో వచ్చింది. మరొక వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో రూ.57,999 ధరతో ప్రకటించబడింది. ఈ రియల్‌మీ స్మార్ట్ ఫోన్ పేపర్ వైట్, పేపర్ గ్రీన్ మరియు స్టీల్ బ్లాక్ అనే మూడు కలర్ లలో లభిస్తుంది. రియల్‌మీ జిటి 2 ప్రో స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 14 నుండి అమ్మకానికి వస్తుంది.ఈ ఫోన్ పైన SBI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డుతో ఈ ఫోన్ కొనేవారికి 5,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ అఫర్ ను అందించింది.

Realme GT 2 Pro: స్పెక్స్

రియల్‌మీ జిటి 2 ప్రో స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ (2K) WQHD+(3216×1440) రిజల్యూషన్ డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు LTPO 2.0 టెక్నలాజిని కలిగివుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 1400 నిట్స్ బ్రైట్నెస్ మరియు 1000 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ని కలిగివుంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 3.0 Ghz క్లాక్ స్పీడ్ అందించగల స్నాప్ డ్రాగన్ 8 Gen 1 5G SoC ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 12GB LPDDR5 ర్యామ్ కూడా ఉంది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. అయితే , ఇది 50MP +50MP ప్రైమరీ కెమెరా సిస్టంతో వచ్చిన మొట్టమొదటి ఫోన్ గా కంపెనీ చెబుతోంది. ఇందులో 50MP సెన్సార్ OIS సపోర్ట్ కలిగిన SonyIMX766 సెన్సార్ కాగా, రెండవది 15mm ఫోకాల్ లెంగ్త్ 150 డిగ్రీల అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. అలాగే, 40X మాగ్నిఫికేషన్ మైక్రో లెన్స్ కెమెరా 2.0 కూడా కూడా వుంది. ఈ రియర్ కెమెరా టన్నుల కొద్ది ఫోటో గ్రఫీ ఫంక్షన్ లను కూడా కలిగివుంది.   

ముందుభాగంలో సెల్ఫీల కోసం 32MP SonyIMX615 సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ Realme UI 3.0 స్కిన్ పైన Android 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన డీల్స్ స్పీకర్ లతో కూడా వస్తుంది. అధనంగా, వేగంగా ఫోన్ ను చల్లబర్చడానికి స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ ఛాంబర్ ట్  వస్తుంది.       

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :