Realme GT 2: ప్రీమియం ఫీచర్లతో వచ్చింది.. ధర, స్పెక్స్ ఇవే..!!

HIGHLIGHTS

Realme GT 2 ని ఇండియాలో విడుదల

65W ఛార్జింగ్ సపోర్ట్ తో చాలా ప్రీమియం ఫీచర్లను కలిగి వుంది

FHD+ E4 AMOLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది

Realme ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ Realme GT 2 Pro యొక్క డౌన్ టోన్ వెర్షన్ గా  Realme GT 2 ని ఇండియాలో విడుదల చేసింది. అయితే, రియల్‌మీ GT 2 డౌన్ టోన్ వెర్షన్ అయినా కూడా పవర్ ఫుల్ ఫీచర్లను కలిగివుంది. GT 2  ఫోన్ క్వాల్కమ్  Snapdragon 888 చిప్ సెట్, 12GB వరకు RAM, 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు వేగవంతమైన 65W ఛార్జింగ్ సపోర్ట్ తో చాలా ప్రీమియం ఫీచర్లను కలిగి వుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్, స్పెక్స్ మరియు ఫీచర్లను గురించి వివరంగా చూద్దాం.

Realme GT 2: ప్రైస్

రియల్‌మీ జిటి 2 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ.34,999 ధరతో ప్రకటించగా, హై ఎండ్ వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో రూ.38,999 రూపాయల ధరతో వచ్చింది. రియల్‌మీ జిటి 2 మొదటి సేల్ ఏప్రిల్ 28 నుండి మొదలవుతుంది. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ కార్డ్‌లు మరియు EMI అప్షన్ తో కొనేవారికి రూ.5,000 తగ్గింపు అఫర్ ను అందుకోవచ్చు.

Realme GT 2: స్పెక్స్

రియల్‌మీ జిటి 2  స్మార్ట్ ఫోన్ 6.62 ఇంచ్ FHD+ E4 AMOLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది మరియు 1300 నిట్స్ పీక్ బ్రిట్నెస్ తో వస్తుంది. ఏ ఫోన్ డిస్ప్లేకి రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ని అందించింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 12GB LPDDR5 ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజ్ కూడా ఉంది. ఈ ఫోన్ ఆకుపచ్చ, నలుపు మరియు తెలుపు మూడు రంగులలో లభిస్తుంది.  

ఇక ఆప్టిక్స్ విభానికి వస్తే, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని అందించింది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 50MP SonyIMX766 ప్రధాన సెన్సార్ కి జతగా  8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ముందు 16MP SonyIMX471 సెన్సార్ సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ Realme UI 3.0 సాఫ్ట్ వేర్ పైన Android 11 OS తో నడుస్తుంది. ఈ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 బ్యాటరీతో వచ్చింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :