Realme Days Sale: రియల్ మి స్మార్ట్ ఫోన్ల పైన రూ.4,000 వరకు డిస్కౌంట్ అందుకోండి

Updated on 31-Dec-2020
HIGHLIGHTS

Realme Days Sale నేటితో ముగుస్తుంది

Realme ప్రోడక్ట్స్ పైన మంచి డిస్కౌంట్

Reaelme ప్రోడక్ట్స్ ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు

ఇటీవల రియల్ మి ప్రకటించిన Realme Days Sale డేట్ ని పొడిగించింది మరియు నేటితో ఈ సేల్ ముగుస్తుంది. ఈ సేల్ నుండి రియల్ మి యొక్క అనేకమైన ప్రోడక్ట్స్ పైన మంచి డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి Realme స్మార్ట్ వాచ్ మొదలుకొని స్మార్ట్ ఫోన్లు,టీవీలు మరియు మరిన్ని ప్రోడక్ట్స్ ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఇక డిస్కౌంట్ తో పాటుగా ఈ సేల్ నుండి ప్రకటించిన ఇతర ఆఫర్ల విషయానికి వస్తే, ఈ సేల్ నుండి కొనుగోలు చేసే ప్రతి రియల్ మి ప్రోడక్ట్ పైన Freecharge యొక్క 75 రూపాయల ఫ్లాట్ క్యాష్ బ్యాక్ మరియు Amazon Pay ద్వారా చెల్లించే వారికీ 100 రూపాయల వరకూ క్యాష్ బ్యాక్ కూడా అఫర్ చేస్తోంది. అలాగే, ఇతర పోటీలలో పాల్గొనడానికి ఉపయోగపడే రెండు Realme కూపన్లను కూడా ఇస్తోంది.

Realme TV కొనాలని చూస్తున్న వారికీ మంచి తరుణం

ఈ Realme Days Sale నుండి అన్ని Realme TV ల పైన డిస్కౌంట్ ని ప్రకటించింది. వీటిలో, Realme యొక్క 32 మరియు 43 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన 1000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించగా, 55 ఇంచ్ SLED స్మార్ట్ టీవీ పైన మాత్రం 3,000 రుపాయల్ డిస్కౌంట్ అందిస్తోంది.

Realme స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్

ఇక అందరికి ఎక్కువగా ఇష్టమైన కేటగిరి స్మార్ట్ ఫోన్ పైన అందించిన డిస్కౌంట్ల విషయానికి వస్తే, ఇందులో కూడా మంచి డిస్కౌంట్ నే అందించింది. ఇందులో, Realme బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గా పేరొందిన C సిరీస్ నుండి Realme C15 మరియు C15 Qualcomm Edition పైన 1000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది.

అలాగే, Realme యొక్క 6 Series నుండి మంచి అమ్మకాలను సాధించిన Realme 6 మరియు 6i స్మార్ట్ ఫోన్ల పైన 2,000 రుపాయల డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అయితే, మిడ్ రేంజ్ మరియు ప్రీమియం స్మార్ట్ ఫోన్లను కలిగిన 'X series' స్మార్ట్ ఫోన్ల పైన మాత్రం భారీగానే డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇందులో, Realme X3 పైన 3,000 రూపాయలు డిస్కౌంట్ ప్రకటించగా, Realme X3 Super Zoom పైన 4,000 మరియు Realme X50 Pro పైన గరిష్టంగా 7,000 రుపాయల్ డిస్కౌంట్ ను అందుకోవచ్చు.                                                            

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :