Realme Narzo 50: ఫిబ్రవరి 24 న విడుదలకావచ్చు.. ది పెర్ఫార్మెన్స్ బూస్ట్ క్యాప్షన్ తో టీజింగ్ ..!

Updated on 19-Feb-2022
HIGHLIGHTS

రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Realme Narzo 50 అని కన్ఫర్మ్ చేసింది

ది పెర్ఫార్మెన్స్ బూస్ట్ క్యాప్షన్ తో టీజింగ్ మొదలుపెట్టింది

లాంచ్ డేట్ ను మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు

రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Realme Narzo 50 అని కన్ఫర్మ్ చేసింది. రియల్ మీ నార్జో 50 స్మార్ట్ ఫోన్ ను ది పెర్ఫార్మెన్స్ బూస్ట్ క్యాప్షన్ తో టీజింగ్ మొదలుపెట్టింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ ను మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఇప్పటికే ఈ ఫోన్ అమెజాన్ నుండి కనిపిస్తున్నందున త్వరలోనే లాంచ్ డేట్ కూడా వెల్లడించవచ్చు.

అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ ను గురించి 91 మొబైల్స్ నివేదిక అందించింది. ఈ నివేదిక ప్రకారం, Realme Narzo 50 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 24 న విడుదల కావచ్చని తెలుస్తోంది.

Realme Narzo 50: అంచనా స్పెక్స్

ఇక Realme Narzo 50 యొక్క అంచనా స్పెక్స్ గురించి చూస్తే, ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G96 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది కావచ్చు మరియు ఈ ఫోన్ 4+64GB మరియు 6+128GB వేరియంట్‌లతో అందించబడవచ్చు. ఈ ఫోన్‌లో స్పీడ్ బ్లాక్ మరియు స్పీడ్ బ్లూ రంగులలో అందించబడుతుంది.

ఈ రియల్ మీ అప్ కమింగ్  USB-C పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయబడే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీతో ఉండవచ్చు.

కెమెరా విభాగంలో, ఈ ఫోన్‌లో 50MP + 2MP + 2MP వెనుక కెమెరా సెటప్ మరియు ఈ ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. ఈ స్మార్ట్ ఫోన్ Android 12 (Android 12) ఆధారంగా realme UI 3.0లో పని చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :