8 వేలకే 5G స్మార్ట్ ఫోన్లు: Realme CEO సంచలన ప్రకటన

Updated on 14-Jun-2021
HIGHLIGHTS

Realme CEO సంచలన ప్రకటన

రూ.8,000 5G స్మార్ట్ ఫోన్లు

ఇక బడ్జెట్ యూజర్లకు కూడా 5G ఫోన్లు

Realme CEO మాధవ్ సేథ్ చేసిన ఒక ప్రకటన అందరిని ఆశ్చర్యపరించింది. అతి త్వరలోనే కేవలం 100 డాలర్లకే 5G  స్మార్ట్ ఫోన్లను తీసుకురానున్నట్లు చెబుతున్నారు. 5G స్మార్ట్ ఫోన్ టెక్నలాజి ఇండియాలో మరింత సరసమైనదిగా అవుతోంది. కేవలం ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్లకు మాత్రమే పరిమితమైన 5G టెక్నాలజీ. కొద్ది కాలంలోనే మీడియం ధర స్మార్ట్ ఫోన్లకు కూడా వచ్చి చేరింది. కానీ, ఇప్పుడు కేవలం 13 వేల ధరలో కూడా 5G స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. తక్కువ ధరలో 5G స్మార్ట్ ఫోన్ అందించిన ఘనత Realme కి సొంతం అవుతుంది. Realme 8 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం 13,999 రూపాయలకే అందించి ఈ ఘనతను సాధించింది.

మాధవ్ సేథ్ చేసిన ప్రకటన ప్రకారం, 100 డాలర్లకే 5G స్మార్ట్ ఫోన్లను తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని మన కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే సుమారు 7,500 రూపాయలు అవుతుంది. అంటే, Realme సంస్థ కేవలం 10 వేల రూపాయల కంటే తక్కువ ధరలోనే 5G స్మార్ట్ ఫోన్లలను తయారు చేసే పనిలో ఉందని చెప్పకనే చెబుతోంది.

ఇక ప్రస్తుతం అన్నింటికీ కన్నా తక్కువ ధరలో లభిస్తున్న 5G స్మార్ట్ ఫోన్ Realme 8 5G విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.5 అంగుళాల పరిమాణంతో 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో FHD+ డిస్ప్లే  మరియు పంచ్ హోల్ డిజైన్ మరియు 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. అంతేకాదు, ఇది గరిష్టంగా 600 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు.

ఈ ఫోన్ మంచి 5G పర్ఫార్మెన్స్ అందించగల, మీడియాటెక్ యొక్క లేటెస్ట్  ప్రొసెసర్ Dimensity 700 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 7nm ప్రొడక్షన్ ప్రొసెసర్ తో గరిష్టంగా 2.2GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇందులో ఉన్న ARM Mali-G57 GPU కారణంగా గ్రాఫిక్స్ కూడా బాగుంటాయిమరియు హెవీ గేమ్స్ కూడా ప్లే చేయవచ్చు.

Realme ఈ ఫోన్ లో వెనుక 48MP నైట్ స్కెప్ కెమెరా సెటప్పును అందించింది. ఈ ట్రిపుల్ కెమెరాలో, f/1.8 ఎపర్చర్ కలిగిన ఒక 48MP ప్రధాన కెమెరాని ఇంచింది. రెండవ కెమేరాగా 4CM మ్యాక్రో మరియు B&W సెన్సార్ ని అందించింది. ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 16MP సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ కెమేరాతో మీరు మంచి  HD సెల్ఫీ ఫోటోలు మరియు వీడియోలను కూడా తీయ్యోచ్చు.  Realme 8 5G  ఒక 5,000mAh బ్యాటరీతో వుంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని వేగవంతమైన టైప్-C 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో క్లైగి వుంటుంది. ఈ వేగవంతమైన ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో చాలా వేగంగా బ్యాటరీని ఛార్జ్ చెయ్యొచ్చు.                                                     

Realme 8 Pro : ధరలు

1. Realme 8 5G  : 4GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.13,999/-

2. Realme 8 5G  : 8GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.16,999/-

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :