బడ్జెట్ ధరలో iPhone లాంటి ప్రీమియం ఫీచర్ తో ఫోన్ లాంచ్ చేసిన Realme.!

HIGHLIGHTS

Realme నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది

ఇందులో ఒక గొప్ప విశేషం వుంది

iPhone 14 pro లో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ వంటి అమరికను ఈ ఫోన్ లో అందించింది

Realme నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. అయితే, ఇందులో ఒక గొప్ప విశేషం వుంది. అదేమిటంటే, Realme C55 పేరుతొ విడుదల చేసిన రియల్ మి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లో ప్రీమియం iPhone 14 pro లో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ వంటి అమరికను అందించింది. అంటే, స్క్రీన్ పైన ఉన్న సెల్ఫీ కెమేరా చుట్టూ ఉన్న కొంత ప్రాంతం నోటిఫికేషన్ బార్ గా మారిపోతుంది మరియు మీకు వినూత్నమైన పద్దతిలో నోటిఫికేషన్లను చూపిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఇండోనేషియాలో లాంచ్ చెయ్యబడింది. ఈ స్మార్ట్ ఫోన్ విశేషాలు ఏమిటో చూద్దామా. 

Realme C55: ఇండోనేషియా ధర

Realme C55 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (6GB+128GB) వేరియంట్ ధర Rp 2.499.000 (సుమారు రూ.13,300) తో లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ ప్రస్తుతం ఇండోనేషియాలో లభిస్తోంది. 

Realme C55: స్పెక్స్ (ఇండోనేషియా)

రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ Layar FHD+ స్క్రీన్ ని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ లో పైన ఉన్న సెల్ఫీలే కెమేరా చుట్టూ ఒక నోటిఫికేషన్ భార్ తో కొత్త ఫీచర్ కనిపిస్తుంది. ఈ బార్ ఫీచర్ ను 'Mini Capsule' గా పిలుస్తోంది. ఈ ఫీచర్ వలన ఫోన్ ప్రీమియం ఫోన్ ఫీల్ మరియు లుక్ ను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Helio G88 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 6GB/8GB ర్యామ్ మరియు 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ లను అప్షన్ లను కలిగి ఉంటుంది. 

కెమెరాల పరంగా, రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమేరా వుంది. ఇందులో, కేవలం 64MP ప్రైమరీ మరియు 2MP సెకండరీ కెమేరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Android 13 OS ఆధారితమైన Realme UI 4.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :