Realme లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ C33 ఫస్ట్ సేల్..!

HIGHLIGHTS

Realme C33 మొదటిసారిగా అమ్మకాలను మొదలుపెట్టానున్నది

ఈ ఫోన్10 వేల సబ్ కేటగిరిలో 50MP డ్యూయల్ కెమెరాతో వచ్చింది

ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది

రియల్ మీ రీసెంట్ గా ఇండియాలో ప్రవేశపట్టిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Realme C33 మొదటిసారిగా అమ్మకాలను మొదలుపెట్టానున్నది. రియల్ మీ సి22 స్మార్ట్ ఫోన్ 10,000 రూపాయల సబ్ కేటగిరిలో 50MP డ్యూయల్ రియర్ కెమెరా, బిగ్ డిస్ప్లే మరియు హెవీ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ సెప్టెంబర్ 12 న జరగనున్నది. ఈ ఫోన్ ను కొనేముందుగా ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతీ విషయం ఇక్కడ వుంది. 

Realme C33: ధర

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ ను 3GB ర్యామ్ మరియు 32 స్టోరేజ్ తో రూ.8,999 ధరతో ప్రకటించింది. అలాగే, 4GB ర్యామ్ మరియు 64 స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. ఈ ఫోన్ సెప్టెంబర్ 12 న మొదటిసారిగా సేల్ కి అంధుబాటులో ఉంటుంది.

Realme C33: స్పెక్స్

రియల్ మీ C33 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ స్క్రీన్ ని 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Unisoc T612 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 3GB/4GB ర్యామ్ మరియు 32GB/64GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన మెమోరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 1TB వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆక్వా బ్లూ, నైట్ సి మరియు శాండీ గోల్డ్ అనే మూడు కలర్ అప్షన్లలో లభిస్తుంది.

కెమెరాల పరంగా, రియల్ మీ C33 స్మార్ట్ ఫోన్ వెనుక కేవలం 50MP+0.3MP డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగిఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :