Realme C3 ఈరోజు మద్యహ్నం విడుదల కానుంది.

Updated on 06-Feb-2020
HIGHLIGHTS

MediaTek Helio G70 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో ఈ రియల్మీ C3 స్మార్ట్ ఫోన్ను తీసుకొస్తోంది.

రియల్మీ సంస్థ, భారతదేశంలో తన స్మార్ట్ ఫోన్ను విడుదల చెయ్యడానికి అన్ని ఏర్పాట్లను చేసింది.ముందుగా, కేవలం 7000 రూపాయల కంటే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందించే సిరీస్ గా వినియోగదారులను ఆకట్టుకున్న Realme యొక్క C సీరీస్ నుండి ఇప్పుడు మరొక స్మార్ట్ ఫోన్ను ఈ రోజు విడుదల చెయ్యడానికి డేట్ ని ప్రకటించింది. అయితే, ఈఫోన్ను ఒక సరికొత్త గేమింగ్ చిప్ సెట్ తో తీసుకురానున్నట్లు ప్రకటించడంతో దీని పైన అంచనాలు మరింతగా పెరిగాయి.    

ఈ స్మార్ట్ ఫోన్ను Realme C3 పేరుతొ C సిరీస్ నుండి తీసుకొస్తోంది. ఇక ఈ ఫోనుకు సంభందించి ఇప్పటి వరకూ ప్రకటించిన అన్ని స్పెక్స్ లేదా ప్రత్యేకతలను చూస్తుంటే, నిజంగా మంచి ప్రత్యేకతలతో ఈ ఫోన్ను విడుదల చెయ్యడానికి సిద్దమవుతున్నట్లు అర్ధమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క టీజింగ్ ను Flipkart అట్నా ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ఒక ప్రత్యేకమైన ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీ ద్వారా అందిస్తోంది. అంటే, ఈ ఫోన్ flipkart ప్రత్యేకంగా అమ్మకానికి రావచ్చు.     

Realme C3 : ప్రాసెసర్ ప్రత్యేకతలు

రియల్మీ సంస్థ, మీడియా టెక్ హీలియో ఇటీవల ప్రకటించిన ఎంట్రీ లెవాల్ గేమింగ్ ప్రాసెసర్ అయినటువంటి, MediaTek Helio G70 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో ఈ రియల్మీ C3 స్మార్ట్  ఫోన్ను తీసుకొస్తోంది. మరొక విశేషం ఏమిటంటే, ఈ ప్రాసెసర్ తో ప్రపంచంలో ఎక్కడ ఒక ఫోన్ రాలేదు,  ఈ ప్రాసెసర్ తో వచ్చే మొట్ట మొదటి స్మార్ట్ ఫోనుగా Realme C3 ఈ జాబితాలో నిలుస్తుంది. ఇక ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడితే, ఇది గరిష్ఠంగా 2Ghz వరకూ క్లాక్ స్పీడ్ అందిస్తుంది మరియు 300Mbps డౌన్లోడ్ లింక్ స్పీడ్ కలిగిన డ్యూయల్ 4G మోడెమ్ తో ఇది వస్తుంది. అంటే, మీ ఆన్లైన్ మరియు గేమింగ్ ఎక్స్పీరియన్సు మరింత చక్కగా మారుతుంది.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :