Realme C25s: నమ్మశక్యం కానీ ధరలో ఆల్ రౌండ్ ఫీచర్లతో వచ్చింది

HIGHLIGHTS

Realme C25s స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది

రియల్మి C సిరీస్ నుండి లేటెస్ట్ గా వచ్చిన Realme C25s

ఆల్ రౌండ్ ఫీచర్లతో వస్తుంది

Realme C25s స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది.  రియల్మి C సిరీస్ నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ Realme C25s స్మార్ట్ ఫోన్ నమ్మశక్యం కానీ ధరలో ఆల్ రౌండ్ ఫీచర్లతో వచ్చింది. ఈ Realme C25s ఫోన్ ట్రిపుల్ కెమెరా, పెద్ద డిస్ప్లే మరియు ఫాస్ట్ ఛార్జింగ్ వాటి ఆల్ రౌండ్ ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ కేవలం 10 వేల కంటే తక్కువ ధరలో లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు క్రింద చూడవచ్చు.

ఈ Realme C25s ఫోన్ 6.5 ఇంచ్ పరిమాణంతో 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్ తో HD+ డిస్ప్లే ని వాటర్ డ్రాప్ నోచ్ డిజైనుతో కలిగివుంటుంది. ఇది గరిష్టంగా 480 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ అందించగల, మీడియాటెక్ యొక్క ప్రొసెసర్ Helio G85 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 12nm  ప్రొసెసర్ తో గరిష్టంగా 2.0GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఈ ప్రాసెసర్ కి  జతగా 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజి కూడా అందుతుంది. 

Realme ఈ ఫోన్ లో వెనుక 48MP ట్రిపుల్ కెమెరా సెటప్పును అందించింది. 48MP ప్రధాన కెమెరాకి జతగా 2MP మ్యాక్రో మరియు 2MP B&W సెన్సార్ ని అందించింది. ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు 8MP సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఈ Realme C25s ఒక 6,000mAh బ్యాటరీతో వుంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని వేగవంతమైన 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఉంటుంది. ఈ వేగవంతమైన ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో చాలా వేగంగా బ్యాటరీని ఛార్జ్ చెయ్యొచ్చు. వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫ్లాష్ లైట్ కూడా వుంది.           

Realme C25s : ధరలు

1. Realme C25s  : 4GB ర్యామ్ + 64 GB స్టోరేజి : Rs.9,999/-

2. Realme C25s  : 4GB ర్యామ్ + 128 GB స్టోరేజి : Rs.10,999/-   

ఈ Realme C25s వాటర్ బ్లూ మరియు వాటర్ గ్రే అనే రెండు అందమైన కలర్స్ లో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :