Realme C20 చాలా తక్కువ ధరలో ఆకట్టుకునే 6 బెస్ట్ ఫీచర్లతో వచ్చింది

Updated on 09-Apr-2021
HIGHLIGHTS

C సిరీస్ నుండి మూడు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది.

6.5 అంగుళాల పరిమాణం గల LCD మల్టి టచ్ డిస్ప్లే

Realme C20 ఒక పెద్ద 5,000mAh బ్యాటరీతో వుంటుంది.

Realme ఈరోజు తన బడ్జెట్ సిరీస్ అయిన C సిరీస్ నుండి మూడు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. వీటిలో,Realme C20 చాలా తక్కువ ధరలో ఆకట్టుకునే 6 బెస్ట్ ఫీచర్లతో వచ్చింది. ఒక సాధారణ మొబైల్ నుండి స్మార్ట్ ఫోన్ కు మరాలనుకునే వారికి ఈ  C20 మంచి ఎంపిక కావచ్చు. ఎందుకంటే, ఇందులో , మీ రోజు వారి వినియోగానికి తగిన మంచి ఫీచర్లను ఇచ్చింది. మరి ఆకట్టుకునే ఆ 6 బెస్ట్ ఫీచర్లేమిటో చూద్దామా.                    

Realme C20 : బెస్ట్ – 6 ఫీచర్లు

1. డిస్ప్లే

ఈ Realme C20 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 అంగుళాల పరిమాణం గల LCD మల్టి టచ్ డిస్ప్లేని HD+ (1600×720 ) పిక్సెల్స్ రిజల్యూషన్ తో మరియు చిన్న వాటర్ డ్రాప్ నాచ్ డిజైనుతో కలిగి వుంటుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 400 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు.                                      

2. ప్రాసెసర్

ఈ ఫోన్ బడ్జెట్ ధరలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించగల ప్రాసెసర్ ను కలిగి వుంది. C20 ఫోన్ మీడియాటెక్ హీలియో G35 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 12nm ఫ్యాబ్రికేషన్ తో గరిష్టంగా 2.3GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇందులో ఉన్న PowerVR GE8320 GPU కారణంగా గ్రాఫిక్స్ కూడా బాగానే ఉంటాయి మరియు మీడియం గేమ్స్ కూడా చక్కగా ప్లే చేయవచ్చు.

3. ర్యామ్ & స్టోరేజి

ఈ ఫోన్ను కేవలం ఒకే ర్యామ్ వేరియంట్ ఎంపికతో మరియు రెండు కలర్లలో ప్రకటించింది. ఇది 2GB ర్యామ్ + 32GB స్టోరేజితో కూల్ బ్లూ మరియు కూల్ గ్రేయ్ కలర్ అప్షన్ లో లభిస్తుంది.

Realme C20 : ధర

1. Realme 8 Pro : 2GB ర్యామ్ + 32GB స్టోరేజి : Rs.6,799/-

4. కెమేరా

ఈ ఫోన్ వెనుక Realme కేవలం సింగిల్ కెమెరాని మాత్రమే అందించింది. ఈ కెమెరాని మంచి రిజల్యూషన్ తో ఫోటోలు తియ్యగల 8MP AI కెమెరాని అందించింది. ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు కూడా సెల్ఫీ కెమెరాకోసం 5MP AI సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ వెనుక కెమేరాతో మీరు మంచి ఫోటోలు మరియు 1080P రిజల్యూషన్ వీడియోలను కూడా తీయ్యోచ్చు.

5. బ్యాటరీ

ఈ Realme C20 ఒక పెద్ద 5,000mAh బ్యాటరీతో వుంటుంది. అయితే , ఈ ఫోన్ యొక్క బ్యాటరీని రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా  అందించింది. అంటే, అత్యవసర సమయంలో వేరొక ఫోన్ ను ఈ ఫోన్ యొక్క బ్యాటరీతో ఛార్జింగ్ చేయవచ్చు.

6. ట్రిపుల్ కార్డు స్లాట్

ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మంచి ట్రిపుల్ కార్డు కలిగిన స్మార్ట్ ఫోన్స్ ఇది. ఇందులో మీరు రెండు మైక్రో సిమ్ కార్డులతో పాటుగా 256GB భారీ స్టోరేజ్ కెపాసిటీ గల మైక్రో SD కార్డును కూడా ఒకేసారి అనుసంధానం చెయ్యవచ్చు.      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :