Realme బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన C సిరీస్ నుండి విడుదల చేసిన Realme C20 ఫస్ట్ సేల్ ఈరోజు జరగనుంది. ఈ ఫోన్ చాలా తక్కువ ధరలో ఆకట్టుకునే 6 బెస్ట్ ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ లో మీ రోజు వారి వినియోగానికి తగిన మంచి ఫీచర్లను ఇచ్చింది. రియల్మి C20 యొక్క 6 బెస్ట్ ఫీచర్లను ఇక్కడ చూడవచ్చు.
Realme C20 : బెస్ట్ – 6 ఫీచర్లు
ఈ Realme C20 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 అంగుళాల పరిమాణం గల LCD మల్టి టచ్ డిస్ప్లేని HD+ (1600×720 ) పిక్సెల్స్ రిజల్యూషన్ తో మరియు చిన్న వాటర్ డ్రాప్ నాచ్ డిజైనుతో కలిగి వుంటుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 400 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు.
ఈ ఫోన్ బడ్జెట్ ధరలో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించగల ప్రాసెసర్ ను కలిగి వుంది. C20 ఫోన్ మీడియాటెక్ హీలియో G35 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 12nm ఫ్యాబ్రికేషన్ తో గరిష్టంగా 2.3GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇందులో ఉన్న PowerVR GE8320 GPU కారణంగా గ్రాఫిక్స్ కూడా బాగానే ఉంటాయి మరియు మీడియం గేమ్స్ కూడా చక్కగా ప్లే చేయవచ్చు.
ఈ ఫోన్ను కేవలం ఒకే ర్యామ్ వేరియంట్ ఎంపికతో మరియు రెండు కలర్లలో ప్రకటించింది. ఇది 2GB ర్యామ్ + 32GB స్టోరేజితో కూల్ బ్లూ మరియు కూల్ గ్రేయ్ కలర్ అప్షన్ లో లభిస్తుంది.
Realme C20 : ధర
1. Realme 8 Pro : 2GB ర్యామ్ + 32GB స్టోరేజి : Rs.6,799/-
ఈ ఫోన్ వెనుక Realme కేవలం సింగిల్ కెమెరాని మాత్రమే అందించింది. ఈ కెమెరాని మంచి రిజల్యూషన్ తో ఫోటోలు తియ్యగల 8MP AI కెమెరాని అందించింది. ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు కూడా సెల్ఫీ కెమెరాకోసం 5MP AI సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ వెనుక కెమేరాతో మీరు మంచి ఫోటోలు మరియు 1080P రిజల్యూషన్ వీడియోలను కూడా తీయ్యోచ్చు.
ఈ Realme C20 ఒక పెద్ద 5,000mAh బ్యాటరీతో వుంటుంది. అయితే , ఈ ఫోన్ యొక్క బ్యాటరీని రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా అందించింది. అంటే, అత్యవసర సమయంలో వేరొక ఫోన్ ను ఈ ఫోన్ యొక్క బ్యాటరీతో ఛార్జింగ్ చేయవచ్చు.
ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మంచి ట్రిపుల్ కార్డు కలిగిన స్మార్ట్ ఫోన్స్ ఇది. ఇందులో మీరు రెండు మైక్రో సిమ్ కార్డులతో పాటుగా 256GB భారీ స్టోరేజ్ కెపాసిటీ గల మైక్రో SD కార్డును కూడా ఒకేసారి అనుసంధానం చెయ్యవచ్చు.