Realme C12: కేవలం బడ్జెట్ ధరలో మరిన్ని ఫీచర్లతో వచ్చేసింది

HIGHLIGHTS

Realme C12, Realme C15 రెండు స్మార్ట్ ఫోన్లు కూడా ఈరోజు ఇండియాలో విడుదలయ్యాయి.

Realme C12 మాత్రం బడ్జెట్ వినియోగదారులను ఆకర్షించే విధంగా తక్కువ ధరలో వచ్చింది.

Realme C12 కేవలం 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌ తో మాత్రమే వస్తుంది

Realme C12, Realme C15 రెండు స్మార్ట్ ఫోన్లు కూడా ఈరోజు ఇండియాలో విడుదలయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్లు రెండు కూడా ముందు నుండి చెబుతూ వస్తున్నట్లుగా, ఒక అతి అతిపెద్ద బ్యాటరీతో తీసుకురాబడ్డాయి. అలాగే, మరిన్ని ట్రెండీ ఫీచర్లతో వచ్చాయి. వీటిలో ముఖ్యంగా, Realme C12 మాత్రం బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని తీసుకురాబడినట్లు చెబుతోంది. ఇందులో అన్ని ప్రధాన ఫీచర్లు వున్నా కూడా ధర మాత్రం బడ్జెట్ పరిధిలోనే ఉంచింది.       

Realme C12 Price

Realme C12 కేవలం 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌ తో మాత్రమే వస్తుంది మరియు ఇది కేవలం రూ .8,999  తక్కువ ధరతో ప్రకటించింది. ఇక  Realme C15 స్మార్ట్ ‌ఫోన్ గురించి మాట్లాడితే, ఇది 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్‌ లో రూ.  9,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేయబడింది. ఇది కాకుండా దాని 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్ కూడా వుంది మరియు ఆ వేరియంట్ ని కేవలం 10,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. రియల్ మీ సి 12 మొబైల్ ఫోన్ యొక్క మొదటి సెల్ ఆగస్టు 24 న జరగనుంది. అయితే,  రియల్‌ మీ సి 15 మొబైల్ ఫోన్ యొక్క మొదటి సెల్ మాత్రం ఆగస్టు 27 న జరగుతుంది. ఈ సేల్  Flipkart మరియు realme ఇండియా స్టోర్ ద్వారా జరుగుతుంది.

Realme C12: ప్రత్యేకతలు

రియల్‌ మీ సి 12 మొబైల్ ఫోన్ ఒక 6.5-అంగుళాల HD + డిస్ప్లే తో లాంచ్ చేయబడింది. ఇందులో మీకు వాటర్ ‌డ్రాప్ నోచ్ డిజైన్ చూడవచ్చు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌ లో మీకు 20: 9 యాస్పెక్ట్ రేషియో లభిస్తోంది. సేఫ్టీ పరంగా, మీరు ఫోన్ ‌లో గొరిల్లా గ్లాస్ రక్షణతో తీసుకురాబడింది .

రియల్‌ మీ సి 12 మొబైల్ ఫోన్ ‌ఒక మీడియాటెక్ హెలియో జి 35 చిప్‌ సెట్ శక్తితో పనిచేస్తుంది. ఇది ఆక్టా-కోర్ సిపియు మరియు ఇది 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్‌ తో జతగా వస్తుంది. ఒక  మైక్రో SD కార్డ్ సహాయంతో కూడా స్టోరేజ్ కూడా పెంచవచ్చు. ఈ మొబైల్ ఫోన్ RealmeUI 1.0 ఆధారంగా ఆండ్రాయిడ్ 10 తో  నడుస్తుంది.

రియల్‌ మీ సి 12 స్మార్ట్ ‌ఫోన్ ‌లో, వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్ ‌లో 13 ఎంపి ప్రైమరీ కెమెరా అమర్చారు, దీనికి జతగా 2 ఎంపి మోనోక్రోమ్ కెమెరాతో పాటు 2 MP డెప్త్ సెన్సార్ ‌ను కూడా పొందవచ్చు. ముందుభాగంలో, ఈ ఫోన్ ‌లో 5 MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఇది ఫోన్ ‌లో ఉన్న నోచ్ లో కనిపిస్తుంది. అలాగే, ఈ ఫోన్ ‌లో ఎల్‌ఈడీ ఫ్లాష్‌ ను కూడా చూడవచ్చు.

ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే, ఈ C 12 స్మార్ట్‌ ఫోన్ వెనుక ప్యానెల్‌ లో వేలిముద్ర సెన్సార్ ‌ను అందించింది. అదనంగా, ఈ ఫోన్ ‌లో ఒక అతి పెద్ద 6000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీఆటో వస్తుంది. ఈ బ్యాటరీ 10W స్పీడ్ ఛార్జింగ్ సాంకేతికతో ఉంటుంది. ఈ ఫోన్ ‌ను బ్లూ మరియు పవర్ సిల్వర్ కలర్ వంటి రెండు వేర్వేరు రంగులలో కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :