Realme C12: 13MP ట్రిపుల్ కెమేరా,6000mAh బ్యాటరీతో వస్తోంది

Updated on 14-Aug-2020
HIGHLIGHTS

Realme C12 అతిపెద్ద 6000 mAh బ్యాటరీతో పాటుగా వెనుక 13MP ట్రిపుల్ కెమేరాతో ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

Realme C12 Camera, వెనుక చతురస్రాకారపు మోడ్యూల్లో ట్రిపుల్ కెమెరా మరియు ఒక LED ఫ్లాష్ కనిపిస్తుంది

ఈ 6,000mAh అతిపెద్ద బ్యాటరీ శక్తి సామర్ధ్యాల గురించి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించింది.

Realme C12 తో పాటుగా ఇతర మార్కెట్లలో ముందుగా లాంచ్ చెయ్యబడిన Realme C15 స్మార్ట్ ఫోన్ ను కూడా ఆగష్టు 18 న ఆన్లైన్ ఈవెంట్ ద్వారా ఇండియాలో విడుదల చేయ్యడానికీ రియల్ మీ ఇప్పటికే డేట్ ఫిక్స్ చెయ్యడం తో పాటుగా మీడియా ఆహ్వానాలను కూడా పంపింది. అయితే, ఇతర మార్కెట్లలో ఈ Realme C15 విడుదల చేయబడింది కాబట్టి దీని స్పెక్స్ మనకు తెలుసు. కానీ, Realme C12 గురించి మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటు వివరాలు తెలియకపోగా, ఇప్పుడు రియల్ మీ విడుదల చేసిన కొత్త అప్డేట్ ద్వారా ఈ ఫోన్ అతిపెద్ద 6000 mAh బ్యాటరీతో పాటుగా వెనుక 13MP ట్రిపుల్ కెమేరాతో ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

Realme C12 Teasing Image

Realme కొత్తగా అందించిన టీజర్ ఇమేజ్ లో పరిశీలించి చూస్తే, అందులో వెనుక చతురస్రాకారపు మోడ్యూల్లో ట్రిపుల్ కెమెరా మరియు ఒక LED ఫ్లాష్ కనిపిస్తుంది మరియు ఇది 13MP ట్రిపుల్ కెమెరా అని, సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అలాగే, కెమెరా క్రింది భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చూడవచ్చు.

Realme C12: బ్యాటరీ & కెమేరా

ఇక ఈ 6,000mAh అతిపెద్ద బ్యాటరీ శక్తి సామర్ధ్యాల గురించి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. ఈ ఫోన్ ఈ బ్యాటరీ సామర్ధ్యంతో, 46 కాలింగ్, 60 గంటల మ్యూజిక్ స్ట్రీమింగ్  మరియు 28 గంటల Youtube వీడియోలను చూసే వీలుంటుందని వివరిస్తోంది.

ఇక కెమేరా విషయంలో కూడా కొన్ని ప్రత్యేకతలను వెల్లడించింది. వీటిలో, Chroma Boost, Slo-MO వీడియో మరియు HDR మోడ్ వంటి ఫీచర్లను హైలైట్ చేసి చూపిస్తోంది. ఇందులో ప్రధాన కెమేరా 13MP కాగా మిగిలిన రెండు కెమేరా సెన్సార్స్ వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :