Realme C12 Launch: అతిపెద్ద 6,000 mAh బ్యాటరీతో ఈరోజు లాంచ్ అవుతోంది

HIGHLIGHTS

Realme C12, గత కొంత కాలంగా అతిపెద్ద 6,000 mAh బ్యాటరీతో ఇండియాలో విడుదల చేయనున్నట్లు రియల్ మీ చెబుతున్నఈ స్మార్ట్ ఫోన్ను ఈరోజు ఇండియాలో లాంచ్ అవుతోంది.

ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకి Realme C12 లాంచ్ ఈవెంట్ మొదలవుతుంది.

Realme C12 స్మార్ట్ ఫోన్ గురించిన మరికొన్ని ఇతర వివరాలు కూడా తెలియపరిచింది

Realme C12, గత కొంత కాలంగా అతిపెద్ద 6,000 mAh బ్యాటరీతో ఇండియాలో విడుదల చేయనున్నట్లు రియల్ మీ చెబుతున్నఈ స్మార్ట్ ఫోన్ను ఈరోజు ఇండియాలో లాంచ్ అవుతోంది. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకి Realme C12  లాంచ్ ఈవెంట్ మొదలవుతుంది. ఇప్పటికే అందించిన టీజర్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ గురించిన మరికొన్ని ఇతర వివరాలు కూడా తెలియపరిచింది.

Realme C12 Specs

Realme కొత్తగా అందించిన టీజర్ ఇమేజ్ లో పరిశీలించి చూస్తే, అందులో వెనుక చతురస్రాకారపు మోడ్యూల్లో ట్రిపుల్ కెమెరా మరియు ఒక LED ఫ్లాష్ కనిపిస్తుంది మరియు ఇది 13MP ట్రిపుల్ కెమెరా అని, సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అలాగే, కెమెరా క్రింది భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చూడవచ్చు.

Realme C12: బ్యాటరీ & కెమేరా

ఇక ఈ 6,000mAh అతిపెద్ద బ్యాటరీ శక్తి సామర్ధ్యాల గురించి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. ఈ ఫోన్ ఈ బ్యాటరీ సామర్ధ్యంతో, 46 కాలింగ్, 60 గంటల మ్యూజిక్ స్ట్రీమింగ్  మరియు 28 గంటల Youtube వీడియోలను చూసే వీలుంటుందని వివరిస్తోంది.

ఇక కెమేరా విషయంలో కూడా కొన్ని ప్రత్యేకతలను వెల్లడించింది. వీటిలో, Chroma Boost, Slo-MO వీడియో మరియు HDR మోడ్ వంటి ఫీచర్లను హైలైట్ చేసి చూపిస్తోంది. ఇందులో ప్రధాన కెమేరా 13MP కాగా మిగిలిన రెండు కెమేరా సెన్సార్స్ వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :