Realme C12 & Realme C15: ఇండియాలో ఆగష్టు 18 న విడుదలకు సిద్ధం

HIGHLIGHTS

Realme C12 & Realme C15 లను భారత్ ‌లో లాంచ్ చేయడానికి రియల్‌ మీ మీడియా ఆహ్వానాలను పంపింది.

Realme యూట్యూబ్, ఫేస్ ‌బుక్ మరియు ట్విట్టర్ ‌లలో ప్రసారం కానున్న ఆన్‌ లైన్ ఈవెంట్ ద్వారా ఆవిష్కరించబడతాయి.

Realme C12 & Realme C15 రెండు స్మార్ట్ ఫోన్లలో కూడా అతిపెద్ద 6000 mAh బ్యాటరీ ఉంటుంది.

Realme C12 & Realme C15 లను భారత్ ‌లో లాంచ్ చేయడానికి రియల్‌ మీ మీడియా ఆహ్వానాలను పంపింది. ఈ స్మార్ట్ ‌ఫోన్స్ యూట్యూబ్, ఫేస్ ‌బుక్ మరియు ట్విట్టర్ ‌లలో ప్రసారం కానున్న ఆన్‌ లైన్ ఈవెంట్ ద్వారా ఆగస్టు 18 న భారత కాలమానం ప్రకారం 12:30 గంటలకు ఆవిష్కరించబడతాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో Realme C15 గత నెలలో ఇతర మార్కెట్లలో లాంచ్ చెయ్యబడింది. అయితే, Realme C12 మాత్రం కొత్తది, దాని ఫీచర్లు గురించి ఎటువంటి సమాచారం తెలియరాలేదు. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో కూడా అతిపెద్ద 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ రెండు స్మార్ట్ ‌ఫోన్స్ గురించి తెలిసిన విషయాలను గురించి చర్చిద్దాం.

Realme C15: ప్రత్యేకతలు

Realme C15 గత నెలలో ఆవిష్కరించబడింది, కాబట్టి ఈ స్మార్ట్ ‌ఫోన్ యొక్క ఫీచర్లు మనకు ముందే తెలుసు. ఈ రియల్ మీ సి 15 స్మార్ట్‌ ఫోన్ ఒక 6.5-అంగుళాల 29: 9 LCD డిస్‌ప్లేను హెచ్‌డి + రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఇది 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్న వాటర్ ‌డ్రాప్ నాచ్ తో వస్తుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో రక్షించబడింది. వెనుకవైపు, ఈ స్మార్ట్ ‌ఫోన్ ‌లో 13 ఎంపి ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మోనోక్రోమ్ కెమెరా మరియు 2 ఎంపి డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ‌ఫోన్ ‌లో వెనుక భాగంలో వేలిముద్ర సెన్సార్ కూడా ఉంది.

రియల్‌ మీ సి 15, MediaTek Helio G35 SoC తో పాటు జతగా 3 జిబి లేదా 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ ‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ఆండ్రాయిడ్ 10 OS పైన నడుస్తుంది. 6000 ఎంఏహెచ్ మొత్తం ప్యాకేజీకి అద్భుతమైన శక్తినిస్తుంది మరియు ఇది మైక్రో యుఎస్‌బి తో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Realme C12: ప్రత్యేకతలు

రియల్‌ మీ సి 12 యొక్క ప్రత్యేకతల గురించి చాలా తక్కువగా తెలుసు. మాకు పంపిన మీడియా ఆహ్వానం నుండి, ఈ స్మార్ట్ ‌ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని అర్ధమవుతోంది. ఇటీవలి Geekbench జాబితా 3 జిబి ర్యామ్ ‌తో పాటు Helio P35 SoC తో పనిచేస్తునట్లు ఒక స్మార్ట్ ‌ఫోన్ కనిపించింది, అది ఇదే కావచ్చు. అయితే ,కెమెరా, డిస్ప్లే మొదలైన మిగతా ఫీచర్లు మాత్రం ఇంకా గోప్యం గానే ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :