రియల్ మీ సి 11 కేవలం రూ.7,499 ప్రైస్ లో బెస్ట్ ఫీచర్లతో విడుదలయ్యింది

HIGHLIGHTS

ఈ రోజు భారతదేశంలో Realme సంస్థ, తన రియల్ మీ సి 11 స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది.

5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు చూడగానే ఆకట్టుకునే ప్రీమియం డిజన్ వంటివి వుంటాయి.

ఈ ఫోన్ ఒక పెద్ద 6.5-అంగుళాల HD + LCD డిస్ప్లేతో 20: 9 యాస్పెక్ట్ రేషియాతో వస్తుంది.

ఈ రోజు భారతదేశంలో Realme సంస్థ, తన రియల్ మీ సి 11 స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. మేము ఇంతకు ముందు నివేదించినట్లుగా, కొన్ని వారాల క్రితం మలేషియాలో ఫోన్‌ను ఆవిష్కరించారు. ఈ బడ్జెట్ స్మార్ట్ ‌ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్లలో – 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు చూడగానే ఆకట్టుకునే ప్రీమియం డిజన్ వంటివి వుంటాయి.

రియల్ మీ సి 11 ఫీచర్లు

రియల్ మీ సి 11, ఒక మీడియా టెక్ Helio G35 గేమింగ్ చిప్సెట్ తో వస్తుంది. ఇది బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్‌ విభాగంలో ఉన్నతమైన గేమింగ్ కోసం తీసుకురాబడిన ఆక్టా-కోర్ చిప్ ‌సెట్. ఈ ఫోన్ ఒక పెద్ద 6.5-అంగుళాల HD + LCD డిస్ప్లేతో 20: 9 యాస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఇందులో,  అధికభాగం స్క్రీన్ కనిపించేలా చేయడం కోసం ఒక చిన్న మినీ‌డ్రాప్ నాచ్ డిజన్ ని అందించింది. ప్రాసెసర్‌తో పాటు 2 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ ఉన్నాయి, ఒక ప్రత్యేకమైన మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ విస్తరించవచ్చు. ఇది Android 10 ఆధారంగా RealmeUI లో నడుస్తుంది.

డ్యూయల్-కెమెరా సెటప్ ఉంది, ఇందులో 13MP ప్రాధమిక కెమెరాని ఒక f / 2.2 లెన్స్ తో  మరియు పోర్ట్రెయిట్ షాట్ల కోసం f / 2.4 లెన్స్‌తో 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో f / 2.4 లెన్స్‌తో 5MP సెల్ఫీ షూటర్ ఉంది. ఇది చదరపు ఆకారపు కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. రియల్ మీ ఫోనాల్కు ఇటువంటి ఒక వినుతమైన డిజైన్ ఇవ్వడం ఇదే ప్రధమం.

రియల్ మీ సి 11 ఒక పెద్ద 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని మైక్రో యుఎస్‌బి పోర్టుతో కలిగి ఉంది మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంది.

 ఇక కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే,  ఇది రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే అనే రెండు రంగులలో వస్తుంది.

రియల్ మీ సి 11 ధర

రియల్ మీ సి 11 యొక్క 2 జిబి + 32 జిబి వేరియంట్ ధర భారతదేశంలో రూ .7,499 గా ప్రకటించింది. ఈ ఫోన్ జూలై 22 న మొదటిసారిగా అమ్మకానికి వెళ్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :