Realme C 11 పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ గేమింగ్ ప్రాసెసర్ మరియు పెద్ద స్క్రేన్ తో ఈరోజు విడుదల అవుతోంది

Updated on 14-Jul-2020
HIGHLIGHTS

Realme C సిరీస్ నుండి మరొక కొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్ ‌ఫోన్ Realme C 11 ను ఈరోజు విడుదల చేయనుంది.

ఈ స్మార్ట్ ఫోన్, ఫాస్ట్ గేమింగ్ ప్రాసెసర్ మీడియాటెక్ Helio G 35 ప్రాసెసర్‌తో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది

మధ్యాహ్నం 1PM కి flipkart మరియు సంస్థ అధికారిక వెబ్సైట్ నుండి ఈ ఫోన్ యొక్క లాంచ్

ఇండియాలో, Realme యొక్క బడ్జెట్ సిరీస్ గా సుపరిచితమైన  పరిచయమున్న, C సిరీస్ నుండి మరొక కొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్ ‌ఫోన్ Realme C 11 ను ఈరోజు విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్, ఫాస్ట్ గేమింగ్ ప్రాసెసర్ మీడియాటెక్ Helio G 35 ప్రాసెసర్‌తో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది మరియు ఈ ప్రాసెసర్ తో పనిచేసే మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ కూడా ఐదు అవుతుంది. ఇప్పటికే, Flipkart నుండి అన్ని ప్రధాన వివరాలు, అంటే  స్పెషిఫికేషన్లను వెల్లడించింది. ఈ ఫోన్ యొక్క లాంచ్ మధ్యాహ్నం 1PM కి flipkart మరియు సంస్థ అధికారిక వెబ్సైట్ నుండి చేస్తుంది.       

ఫ్లిప్ కార్ట్  నుండి అందించిన వివరాల ప్రకారం, Realme C11 కి క్లాసిక్ డిజైన్ ఇవ్వబడింది మరియు డిస్ప్లే పైన డ్రాప్ ఆకారపు గీత అంటే మినీ నోచ్ అందించింది. దిగువ ఫ్రేమ్ కొద్దిగా మందంగా ఉండగా ఈ స్మార్ట్ ఫోనుకు సన్నని అంచు ఇవ్వబడింది.

Pixel 4 మరియు iPhone 11 సిరీస్‌లలో మనం చూసినట్లుగా స్క్వేర్ కెమెరా మాడ్యూల్ ఈ Realme C 11 వెనుక భాగంలో ఇవ్వబడింది. కెమెరా సెటప్‌లో LED  ఫ్లాష్‌తో రెండు సెన్సార్లు ఇవ్వబడ్డాయి. ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి ఎటువంటి గుర్తులు కనుగొనబడలేదు, కాబట్టి కంపెనీ దాన్ని తీసివేసిందని లేదా సైడ్-మౌంటెడ్ స్కానర్ ఈ ఫోనులో ఇస్తుందని భావిస్తున్నారు.

Realme C11 స్మార్ట్ ‌ఫోన్‌కు,  6.5 అంగుళాల స్క్రీన్ ఇవ్వబడింది, ఈ ఫోన్‌కు 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటుగా , ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు తోడ్పడుతుందని ఈ పోస్టర్ తెలిపింది. ఇది కాకుండా, డ్యూయల్ కెమెరా నైట్‌ స్కేప్ మోడ్‌తో వస్తుంది. 3.5 MM ఆడియో జాక్‌తో ఈఫోన్ తీసుకురాబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్,  బూడిద మరియు ఆకుపచ్చ రంగులలో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :