realme announces big deals on realme 14 Pro+ 5G for valentines day sale
Realme 14 Pro+ 5G స్మార్ట్ ఫోన్ పై ఈరోజు గొప్ప డీల్స్ అందించింది. ప్రేమికుల రోజు సందర్భంగా రియల్ మీ తీసుకు వచ్చిన Valentine’s day sale నుంచి అందించిన బిగ్ డీల్స్ లో ఇది కూడా ఒకటి. ఈ సేల్ నుంచి రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 14 Pro+ 5G పై బ్యాంక్ డిస్కౌంట్ మరియు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ వంటి మరియు మరిన్ని ఆఫర్లు అందించింది.
రియల్ మీ 14 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 29,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ తో మూడు వేరియంట్లను ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు మూడు వేరియంట్స్ పై బెస్ట్ డీలా అందించింది.
రియల్ మీ 14 ప్రో+ 5జి స్మార్ట్ ఫోన్ యొక్క 8GB +128GB మరియు 8GB +256GB రెండు వేరియంట్స్ పై రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను రూ. 27,999 స్టార్టింగ్ ప్రైస్ తో అందుకునే వీలుంది. అయితే, 12GB + 256GB హై ఎండ్ వేరియంట్ పై మాత్రం రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ జత చేసింది. ఈ ఆఫర్ ను అన్ని బ్యాంకుల డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై అందించింది. ఈ బ్యాంక్ ఆఫర్ realme.com మరియు Flipkart నుంచి కూడా అందుకోవచ్చు.
బ్యాంక్ డిస్కౌంట్ కాకుండా ఈ ఫోన్ పై 12 నెలల No Cost EMI మరియు ఈ ఫోన్ పై ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను కూడా అందించింది. పాత ఫోన్ తో ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ద్వారా కొనుగోలు చేసే వారికి వారి ఫోన్ కు ఆఫర్ చేసే రేటుతో జతగా అదనపు బోనస్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను తక్కువ ధరకు అందుకునే అవకాశం అందించింది.
Also Read: Jio 2025 Plan: రీఎంట్రీ ఇచ్చిన రూ. 2025 అన్లిమిటెడ్ ప్లాన్.. ఆ బెనిఫిట్స్ మాత్రం ఉండవట.!
రియల్ మీ 14 ప్రో+ 5g స్మార్ట్ ఫోన్ యూనిక్ పర్ల్ డిజైన్ మరియు కలర్ ఛేంజింగ్ ఫీచర్ తో అందించింది. ముందెన్నడూ లేని విధంగా ఈ ఫోన్ ను మ్యాజిక్ గ్లో ట్రిపుల్ ఫ్లాష్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 50MP పెరిస్కోప్, 50MP మెయిన్ మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా 4K వీడియోలు 30fps వద్ద షూట్ చేయగలదు మరియు మంచి ఫోటోలు అందిస్తుందని రియల్ మీ తెలిపింది.
ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 7s Gen 3 తో పని పని చేస్తుంది మరియు జతగా 12GB ర్యామ్ వరకు ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ లో 6.8 ఇంచ్ బిగ్ OLED స్క్రీ ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి వుంటుంది.