రియల్మీ A1 : రూ.6000 ధరలో, ఒక ఎంట్రీ – లెవల్ స్మార్ట్ ఫోనుగా విడుదలయ్యే అవకాశం

Updated on 28-Dec-2018
HIGHLIGHTS

మీడియా టెక్ హీలియో P60 లేదా స్నాప్ డ్రాగన్ 600 - సీరీస్ SoC కలిగి ఉండవచ్చు.

ముఖ్యాంశాలు:

1. రియల్మీ A1 ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోనుగా విడుదలయ్యే అవకాశం 

2. మీడియా టెక్ హీలియో P60 లేదా స్నాప్ డ్రాగన్ 600 సీరీస్ SoC కలిగి ఉండవచ్చు

3. 2019 మొదటి త్రైమాసికంలో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు

ఇది ఈ ఏడాది ప్రారంభంలో Oppo నుండి వేరు విడిపోయిన, రియల్మీ కంపెనీ ప్రస్తుతం భారతీయ విఫణిలో బలిష్టంగా ఉంది మరియు భారతదేశంలో సరసమైన ఫోన్ యొక్క అన్ని విభాగాలలో తన ఫోన్లను నింపడానికి త్వరత్వరగా తన స్మార్ట్ ఫోన్లను ప్రారంభిస్తోంది. ఇది ఇప్పటికే వేర్వేరు ధరల విభాగాల్లో పలు డివైజ్లను  తీస్కువచ్చింది మరియు ఇప్పుడు మరొక దానిని పరిచయం చేయడానికి చూస్తోంది,  దీనిని రియల్మి A1 గా సంభోదిస్తూ అనేక పుకార్లు ఇప్ప్పటికే మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా, ఈ పరికరం ఒక ఎంట్రీ-లెవల్ ఫోనుగా నివేదించబడింది మరియు రూ. 6000 ధరకే ఉంటుందిని ఒక అంచనా.

DroidShout ప్రకారం, పుకార్లలో ఉన్న ఈ ఫోన్ యొక్క లక్షణాలు తెలియవు కాని ఇది మీడియా టెక్ హీలియో P60 లేదా స్నాప్డ్రాగన్ 600-సిరీస్ చిప్సెట్ ద్వారా ఆధారితం కావచ్చు. ఈ ప్రత్యేక ఫోన్ వెనుక మరియు ముందు కూడా డ్యూయల్-కెమెరా సెటప్పుతో వస్తుంది. సాఫ్ట్ వేర్ పరంగా, ఈ రియల్మీ A1 బాక్సులో నుండి వస్తూనే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో-ఆధారిత ColorOS 5.2 తో నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 2019 మొదటి త్రైమాసికంలో ప్రారంభించవచ్చు.

రియల్మీకి ఇప్పటికే  తక్కువ ధరలో ఒక ఫోన్ విడుదలచేసింది, ఇది రూ. 10,000 ధర పరిధికి చెందిన రియల్మిC1  మరియు ఇది రూ. 7,499 రూపాయల ధరకే ఒక గ్లాస్ బ్యాక్ తో వస్తుంది, ఇది ఒక 6.2-అంగుళాల HD + డిస్ప్లేల్లో ఒక నోచ్ తో పాటుగా అందిస్తుంది. ఈ పరికరం ఆండ్రాయిడ్ 8.1 ఓరియోను కలర్ OS 5.1 తో టాప్ చేస్తుంది. రియల్మీC1 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ చేత శక్తిస్తుంది. అలాగే,  2GB RAM మరియు 16GB అంతర్గత స్టోరేజితో పాటు 256GB వరకు విస్తరించవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, ఇది 13MP + 2MP డ్యూయల్ -వెనుక కెమెరా సెటప్ కలిగివుంది, ఇది పోర్ట్రెయిట్ లైటింగ్, బోకె మరియు సూపర్ వైడ్ మోడ్ల్లో చిత్రాలను తీసుకోవడానికి మద్దతు ఇస్తుంది. ఇది HD రిజల్యూషన్లో 90fps వద్ద స్లో-మోషన్ వీడియోను కూడా రికార్డ్ చేయగలుగుతుంది. ముందు, ఈ హ్యాండ్సెట్ ఒక AI- శక్తి కలిగిన  ఒక 5MP సెన్సార్ను f / 2.2 ఎపర్చరు మరియు ఒక 1.12um  పిక్సెల్ పరిమాణంతో కలిగి ఉంటుంది. ముందు కెమెరా హైబ్రిడ్ HDR, గ్రూప్ సెల్ఫీ ఫీచర్లు,  సెల్ఫీ బోకె ఎఫెక్ట్ మరియు AI ఫేస్ అన్లాక్ వంటివాటికి కూడా మద్దతిస్తుంది. ఒక 4,320 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ను వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :