6GB + 5GB ర్యామ్ ఫీచర్ తో రేపు విడుదలకానున్న Realme 9i

Updated on 17-Jan-2022
HIGHLIGHTS

Realme 9i స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో విడుదల అవుతోంది

5GB ఎడిషన్ వర్చువల్ RAM సపోర్ట్ తో తీసుకువస్తోంది

50MP ట్రిపుల్ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మరిన్ని ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ కానుంది

Realme 9i స్మార్ట్ ఫోన్ రేపు ఇండియాలో విడుదల అవుతోంది. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేస్తున్నట్లు రియల్ మి ప్రకటించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 5GB ఎడిషన్ వర్చువల్ RAM సపోర్ట్ తో తీసుకువస్తోంది. ఇది మాత్రమే కాదు, 50MP ట్రిపుల్ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మరిన్ని ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. వాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవల వియాత్నం లో విడుదల చెయ్యబడింది. ఇప్పుడు ఇండియాలో రేపు విడుదలకు సిద్ధమవుతోంది.

Realme 9i: స్పెక్స్( వియాత్నం వేరియంట్)

రియల్ మి 9i స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన IPSLCD డిస్ప్లేని కలిగివుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. అయితే, ఇది 5GB ఎడిషన్ వర్చువల్ RAM కి మద్దతు ఇస్తుంది. అంటే, ఈ Realme ఫోన్ 11GB RAM పనితీరును ఇవ్వగలదు మరియు 128GB ఇంటర్నల్ స్టోర్ కూడా అందుతుంది. ఈ లేటెస్ట్ రియల్ మి ఫోన్  Realme UI 2.0 స్కిన్ పైన Android 11 OS పైన నడుస్తుంది.

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని అందించింది. ఇందులో 50MP మైన్ కెమెరా, మ్యాక్రో మరియు B&W సెన్సార్ వున్నాయి. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ ఫోన్ టైప్-C పోర్ట్ తో 33W  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh  బ్యాటరీతో వస్తుంది.   

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :