Realme 9i: డైనమిక్ ర్యామ్ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ తో బడ్జెట్ ధరలో వచ్చింది

HIGHLIGHTS

రియల్ మి ఈరోజు ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Realme 9i ని విడుదల చేసింది

5GB ఎడిషన్ వర్చువల్ RAM సపోర్ట్ తో తీసుకురావడం విశేషం

ఈ ఫోన్ టైప్-C పోర్ట్ తో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీతో వస్తుంది

రియల్ మి ఈరోజు ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Realme 9i ని విడుదల చేసింది.ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలో ప్రకటించినా 5GB ఎడిషన్ వర్చువల్ RAM సపోర్ట్ తో తీసుకురావడం విశేషంగా చెప్పుకోవచ్చు.  రియల్ మి ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు కెమెరాల విభాగంలో ఈ సెగ్మెంట్ లో ప్రస్తుత మార్కెట్లో వున్న ఫోన్లకు గట్టి పోటీదారుగా తీసుకొచ్చింది. ఈ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం.         

Realme 9i: ధర

రియల్ మి 9i స్మార్ట్ ఫోన్ యొక్క 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ధర రూ. 13,999 మరియు 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999 గా నిర్ణయించింది. ఈ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ జనవరి 22 న మధ్యాహ్నం 12 గంటలకు Flipkart మరియు Realme అధికారిక వెబ్సైట్ నుండి జరగనుంది.            

Realme 9i: స్పెక్స్

రియల్ మి 9i స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన IPSLCD డిస్ప్లేని కలిగివుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. అయితే, ఇది 5GB ఎడిషన్ వర్చువల్ RAM కి మద్దతు ఇస్తుంది. అంటే, ఈ Realme ఫోన్ 11GB RAM పనితీరును ఇవ్వగలదు మరియు 128GB ఇంటర్నల్ స్టోర్ కూడా అందుతుంది. ఈ లేటెస్ట్ రియల్ మి ఫోన్  Realme UI 2.0 స్కిన్ పైన Android 11 OS పైన నడుస్తుంది.

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని అందించింది. ఇందులో 50MP మైన్ కెమెరా, మ్యాక్రో మరియు B&W సెన్సార్ వున్నాయి. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ ఫోన్ టైప్-C పోర్ట్ తో 33W  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh  బ్యాటరీతో వస్తుంది.   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :