Realme నుండి వస్తున్న మరొక కొత్త 5G స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

మరొక కొత్త రియల్ మీ స్మార్ట్ ఫోన్

Dimensity 810 చిప్ సెట్

మరొక కొత్త Realme 5G స్మార్ట్ ఫోన్

రియల్ మీ మరొక కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.  అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ముఖ్యమైన వివరాలను కూడా వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను Realme 8S గా తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ ప్రోసెసర్ Dimensity 810 చిప్ సెట్ శక్తితో అందిస్తున్నట్లు కూడా తెలిపింది. ఈ ఫోన్ Flipkart నుండి సేల్ కావచ్చు.  ఎందుకంటే, ఇప్పటికే Flipakrt ఈ ఫోన్ గురించి టీజింగ్ మొదలుపెట్టింది.

ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రోసైట్‌ని ఏర్పాటు చేయడంతో ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ అవుతుంది. ఇక మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్ 5G స్మార్ట్‌ఫోన్ అని వెల్లడించింది మరియు ఈ ఫోన్ లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌ తో వస్తున్న మొదటి ఫోన్ కూడా అవుతుంది. వాస్తవానికి, రియల్ మీ 8ఎస్ స్మార్ట్ ఫోన్ Realme 8i మరియు Realme Pad తో పాటుగా ప్రకటించబడుతుందని ఆశిస్తున్నారు. అయితే, ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.

Realme 8S: అంచనా స్పెక్స్

ముందుగా వచ్చిన లీక్స్ ప్రకారం, Realme 8s స్మార్ట్ ఫోన్ వెనుక స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్ లో అమర్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ గల 6.5 ఇంచ్ డిస్ప్లే తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌ శక్తితో పనిచేస్తుంది మరియు 6జిబి మరియు 8జిబి అప్షన్ లతో జతచేయవచ్చు. అలాగే, బిగ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తుందని ఊహిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :