Realme 8i: భారీ 50MP కెమెరా మరియు హెవీ గేమింగ్ ప్రోసెసర్ తో వచ్చింది..ధర ఏంతంటే..?

HIGHLIGHTS

Realme 8i Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో లాంచ్

50MP ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చింది

6.6 ఇంచ్ Full-HD+ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే

రియల్ మీ ఈరోజు తన బడ్జెట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ Realme 8i ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో గొప్ప ఫీచర్లతో వచ్చింది. ఈ లేటెస్ట్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చింది.  ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో ఇండియాలో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ గా నిలిచింది. ఈ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి పూర్తిగా  తెలుసుకుందాం.                 

Realme 8i: ప్రైస్

రియల్ మీ 8i స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ రూ. 13,999 రూపాయల ధరతో, 6GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ రూ.15,999 రూపాయల ధరతో ప్రకటించింది. సెప్టెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipkart మరియు రియల్ మీ అధికారిక వెబ్ సైట్ లలో ఫస్ట్ సేల్ జరుగుతుంది.    

Realme 8i: స్పెక్స్

రియల్ మీ 8i ఫోన్  6.6 ఇంచ్ Full-HD+ రిజల్యూషన్ డిస్ప్లే మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Helio G96 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. ఇది మంచి సూపర్ గా పనిచేసే నైట్ మోడ్ అప్షన్ తో  మినిమమ్ బ్రెట్ నెస్ 1నిట్ ని సెట్ చేసుకునేలా అప్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ Android 11 ఆధారితంగా RealmeUI 2.0 స్కిన్ పైన పనిచేస్తుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా మరియు జతగా 2ఎంపి `పోర్ట్రైట్ కెమెరా మరియు 2ఎంపి మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో సెల్ఫీల కోసం 16 EIS మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ కేమెరా సిస్టం మంచి డెప్త్ ఫోటోలను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

రియల్ మీ 8i ఫోన్ లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతునిచ్చే 5,000 బిగ్ బ్యాటరీ మరియు  రిటైల్ బాక్స్ లో ఫాస్ట్ ఛార్జర్ కూడా అందుతుంది. ఈ ఫోన్ లో Dirac సౌండ్ ఎఫెక్ట్  మరియు MT6366 ఆడియో డీకోడింగ్ చిప్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :