Realme 8 5G లాంచ్!! మరికొద్ది సేపట్లో!

Updated on 22-Apr-2021
HIGHLIGHTS

Realme 8 5G డ్యూయల్ 5G సపోర్ట్ తో వస్తుంది

ఎక్కువ ఎనర్జీ ఆదా చేయగల శక్తి

Dimensity 700 5G ప్రొసెసర్

ఈరోజు మధ్యాహ్నం రియల్మి 8 సిరీస్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ విడుదల అవుతోంది. రియల్మి 8 సిరీస్ నుండి 5G రెడీగా Realme 8 5G  స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. ఈ Realme 8 5G లాంచ్ ఈవెంట్ ఈరోజు మధ్యాహ్నం 12:30 నిముషాలకు స్టార్ట్ అవుతుంది. ఈ Realme 8 5G స్మార్ట్ ఫోన్ పేరుకు తగ్గట్టుగానే 5G చిప్ సెట్ మరియు ఫీచర్లతో వస్తుంది. Realme  తన అధికారిక వెబ్ సైట్ నుండి దీనికి సంభందించి కొన్ని ఫీచర్లను కూడా వెల్లడించింది.

దీని ప్రకారం, Realme 8 5G స్మార్ట్ ఫోన్ డ్యూయల్ 5G సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 700 5G ప్రొసెసర్ తో విడుదల కానున్న మొదటి స్మార్ట్ ఫోన్ కొద ఇదే అవుతుంది. ఈ ప్రొసెసర్ 7nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది కాబట్టి, ఎక్కువ ఎనర్జీ ఆదా చేయగల శక్తితో వుంటుంది.

ఇక Dimensity 700 5G ప్రొసెసర్ విషయానికి వస్తే, ఇది ఆక్టా కోర్స్ తో వుంటుంది. వీటిలో, రెండు పెద్ద Cortex-A76 కోర్స్ మరియు ఆరు Cortex-A55 కోర్స్ తో జతగా వుంటుంది. ఇది Mali-G57 MC2 GPU వస్తుంది మరియు గరిష్టంగా 12GB LPDDR4X ర్యామ్ వరకూ సపోర్ట్ చేస్తుంది.  Dimensity 700 5G ప్రొసెసర్ 64MP ప్రైమరీ కెమెరాకి జతగా రెండు 16MP కెమెరాల వరకూ సపోర్ట్ చేస్తుంది. ఇది AI బొకే, AI కలర్ మరియు AI బ్యూటీ మోడ్స్ వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది.

ఇది వెలుగు తక్కువ వుండే సమయాల్లో కూడా మంచి ఫోటోలను తియ్యడానికి వీలుగా హార్డ్-ఆధారిత ఇమేజింగ్ యాక్సిలరేటర్స్ ను కూడా కలిగివుంది. అయితే, Realme 8 5G ఫోనులో కంపెనీ ఎటువంటి వివరాలను అందించిందనే విషయం మాత్రం ఫోన్ లాంచ్ సమయానికి తెలుస్తుంది.                              

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :