Realme 7 series: 65W సూపర్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ ని మిడ్ రేంజ్ ధరలో ఇవ్వనుందా?

Updated on 27-Aug-2020
HIGHLIGHTS

Realme 7 series నుండి Realme 7 మరియు Realme 7 Pro స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విడుదల చెయ్యడానికి రియల్ మీ సంస్థ తేదీని ప్రకటించింది.

సెప్టెంబర్ 3 వ తేదీకి ఈ Realme 7 series ని ఇండియాలో విడుదల చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది.

Realme 7 series స్మార్ట్ ఫోన్లను 65W సూపర్ డార్ట్ ఛార్జ్ మరియు బెస్ట్ ఇన్ క్లాస్ కెమెరాతో ఈ స్మార్ట్ ఫోన్లను తీసుకురానున్నట్లు అర్ధమవుతోంది.

Realme 7 series నుండి  Realme 7 మరియు Realme 7 Pro స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విడుదల చెయ్యడానికి రియల్ మీ సంస్థ తేదీని ప్రకటించింది.  సెప్టెంబర్ 3 వ తేదీకి ఈ Realme 7 series ని ఇండియాలో విడుదల చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ల గురించి కీలకమైన ఫీచర్ ని కూడా ఈ టీజింగ్ ద్వారా అందించింది. ఇందులో భాగంగా, అందించిన టీజింగ్ ద్వారా 65W సూపర్ డార్ట్ ఛార్జ్ మరియు బెస్ట్ ఇన్ క్లాస్ కెమెరాతో ఈ స్మార్ట్ ఫోన్లను తీసుకురానున్నట్లు అర్ధమవుతోంది.

Realme 7 series టీజింగ్ ఏంచెబుతోంది ?

Realme 7 series యొక్క టీజింగ్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా ఒక మైక్రో సైట్ పేజీని కూడా అందించింది. ఈ పేజీ ద్వారా చేస్తున్న టీజింగ్ ఇమేజెస్ మరియు వివరాల ద్వారా Realme 7 series నుండి విడుదల కానున్న  Realme 7 మరియు Realme 7 Pro ఫోన్లలో 65W Super Dart Charge ని మరియు మంచి క్లారిటీ గల కెమేరాలను ఇవ్వనున్నట్లు అనిపిస్తోంది.

ముందుగా realme విడుదల చేసిన Realme 2 సురేష్ నుండి మొదలుకొని లేటెస్ట్ 6 సిరీస్ వరకు అందించిన ధరల వివరాలను మరియు ట్రాక్ ని గమనిస్తే, వీటన్నిటిని కూడా బడ్జెట్ మరియు మిడ్ రేంజ్ వినియోగదారులను టార్గెట్ చేసుకొని తీసుకురాబడినవే. ఇదే ట్రెండ్ ఫాలో అయితే కనుక ఈ స్మార్ట్ ఫోన్లను కూడా అదే విధంగా బడ్జెట్ మరియు మిడ్ రేంజ్ వినియోగదారులను టార్గెట్ చేసుకొని విడుదల చేసే అవకాశం ఉండవచ్చు.

ఇదే కనుక నిజమైతే  రియల్ మీ అభిమానులకు మరియు  మంచి స్పెక్స్ మరియు ఫీచర్ కొనాలనుకునే స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులను ఆకర్షించే ధరలతో ఈ సిరీస్ మార్కెట్ లోకి ప్రవేశపెట్టవచ్చు. ఇదే విషయాన్నిమరియు ఇతర వివరాలను కూడా Realme అధికారికంగా తన ట్విట్టర్ పేజ్ నుండి షేర్ చేసింది. ఈ ట్వీట్ ఈ క్రింద చూడవచ్చు.      

 

https://twitter.com/realmemobiles/status/1298840161715998720?ref_src=twsrc%5Etfw

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :