64MP Sony కెమేరా గల Realme 7 మొదటి సేల్ ఈరోజే

HIGHLIGHTS

Realme 7 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధర విభాగంలో గొప్ప ఫీచర్లతో వచ్చింది

తక్కువ ధరలో ఈ స్మార్ట్ ఫోన్ 64MP Sony IMX682 క్వాడ్ కెమేరా సెటప్ ని అందిస్తుంది

ఇటీవల మంచి ఫీచర్లతో Realme 7 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ Realme 7 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధర విభాగంలో గొప్ప ఫీచర్లతో వచ్చింది. అంతేకాదు, తక్కువ ధరలో ఈ స్మార్ట్ ఫోన్ 64MP Sony IMX682 క్వాడ్ కెమేరా సెటప్ ని అందిస్తుంది. అలాగే, MediaTek Helio G95 ప్రాసెసర్ తో వచ్చిన మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్ కూడా ఇదే అవుతుంది. ఇన్ని ఫీచర్లు కలిగిన ఈ Realme 7 స్మార్ట్ ఫోన్ సేల్  ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart మరియు Relame.com నుండి జరుగుతుంది.    

Realme 7 Price

రియల్‌ మీ 7 రెండు వేరియంట్లలో వస్తుంది: అవి – 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ‌తో బేస్ వేరియంట్ రూ .14,999 ధరతో, 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌ రూ .16,999 దార్లో లభిస్తుంది.

Realme 7 First Sale

రియల్ మీ 7 ఈరోజు నుండి అమ్మకానికి వస్తుంది మరియు ఫ్లిప్‌కార్ట్, Realme ఇండియా స్టోర్లలో లభిస్తుంది. అయితే,  త్వరలోనే భారతదేశం అంతటా ఆఫ్‌ లైన్ రిటైల్ దుకాణాల్లో కూడా లభిస్తుంది.

Realme 7: ప్రత్యేకతలు

రియల్ ‌మీ 7 లో ఒక పెద్ద 6.5-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే 90Hz అధిక రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ తో వస్తుంది. ఈ డిస్ప్లే LCD స్క్రీన్‌ను ఉపయోగిస్తుంది, అయితే అధిక రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది మరియు గొరిల్లా గ్లాస్ 3 గ్లాస్ రక్షణతో వస్తుంది.

రియల్ మీ 7 మందం 9.4 మిల్లీమీటర్లు మరియు 196.5 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్ప్లాష్‌ ప్రూఫ్, ఎందుకంటే నీటి నుండి నష్టాన్ని నివారించడానికి సిలికాన్ సీలింగ్‌లను కలిగి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు పవర్ బటన్ కూడా ఒకటే బటన్ అవుతుంది.

రియల్ మీ 7 ను MediaTek Helio G95 ప్రాసెసర్ ఆక్టా-కోర్ CPU  మరియు మాలి-జి 76 GPU తో కలిగి ఉంది. ఇది 6GB / 8GB RAM మరియు 64GB / 128GB స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. ఈ ఫోన్ Realme UI లో నడుస్తుంది.

Realme 7 వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో ఎఫ్ / 1.8 ఎపర్చరు గల ప్రాధమిక  64MP కెమెరాతో అదికూడా Sony IMX682 సెన్సార్, 8 ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా 119-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్- వ్యూ, B&W  పోర్ట్రెయిట్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి వుంటుంది. అయితే ముందు భాగంలో మీకు ఎఫ్‌ / 2.0 ఎపర్చర్‌తో 16 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది.

రియల్‌ మీ 7 లో పేద్ద 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 30W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్‌ మీకు అందుతుంది. ఈ బాక్స్ లో అందించబడిన ఈ 30W డార్ట్ ఛార్జ్ అడాప్టర్‌ను ఉపయోగించడం ద్వారా ఈ ఫోన్ 0-100% ఛార్జ్ చేయ్యుడానికి 65 నిమిషాలు పడుతుందని రియల్ మీ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :