రియల్మీ 6i స్మార్ట్ ఫోన్ Helio G80తో వచ్చిన మొదటి ఫోనుగా నిలిచింది

Updated on 18-Mar-2020
HIGHLIGHTS

Realme 6i లో 5,000WAh బ్యాటరీ ఉంది

ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది

రియల్మి ఎట్టకేలకు తన రియల్మీ6 i  స్మార్ట్ ఫోన్ను మయన్మార్‌ లో లాంచ్ చేసింది మరియు ఇది రియల్మీ 5i స్థానంలో వచ్చింది. రియల్మి 6i స్మార్ట్‌ ఫోన్ హెలియో G 80 యొక్క శక్తితో నడుస్తుంది మరియు ఈ చిప్‌సెట్‌ తో వచ్చిన మొదటి ఫోన్ కూడా ఇదేకానుంది. క్వాడ్ రియర్ కెమెరా మరియు సెల్ఫీ కెమెరా ఈ ఫోన్‌ లో లభిస్తాయి. ఈ ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్లలో వస్తుంది మరియు వైట్ మిల్క్ మరియు గ్రీన్ టీ వంటి రెండు రంగులలో వస్తుంది.

రియల్మి 6i ధర

రియల్మి 6 i  రెండు ర్యామ్ మరియు స్టోరేజ్‌లలో వస్తుంది. ఒకటి 3 జిబి + 64 జిబి వేరియంట్, దీని ధర MMK 249,900 (సుమారు రూ. 13,000) కాగా, 4 జిబి + 128 జిబి వేరియంట్ ధర MMK  299,900 (సుమారు రూ. 15,600). రియల్మి 6 i మార్చి 18 నుండి మార్చి 26 వరకు మయన్మార్‌ లో ప్రీ-ఆర్డర్‌ లో ఉంటుంది మరియు సంస్థ యొక్క ఫేస్‌బుక్ పేజీ నుండి ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

రియల్మి 6i : స్పెసిఫికేషన్

రియల్మి 6i రియల్మిUI లో ఆండ్రాయిడ్ 10 తో పాటుగా డ్యూయల్ సిమ్‌ తో వచ్చింది. ఇది 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 20: 9 యొక్కఆస్పెక్ట్ రేషియా గల  ఒక 6.5-అంగుళాల FHD స్క్రీన్ కలిగి ఉంది. ఈ ఫోన్‌ కు మీడియాటెక్ హెలియో జి 80 SoC  శక్తినిస్తుంది. మాలి జి 52 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU) గ్రాఫిక్స్ కోసం ఈ ఫోనులో ఉంచబడింది. ఈ ఫోనులో 3 జీబీ మరియు 4 జీబీ ర్యామ్ ఉంది.

కెమెరా గురించి మాట్లాడితే, ఈ రియల్మి 6i లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, దీనిలో 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది మరియు ఇది  f / 1.8 ఎపర్చరుతో వస్తుంది. రెండవ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2MP బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రెయిట్ లెన్స్ మరియు 2MP మాక్రో లెన్స్ లభిస్తుంది. ముందు కెమెరా విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోనుకు ముందు 16 మెగాపిక్సెల్ షూటర్ లభిస్తుంది, ఇది ఎపర్చరు ఎఫ్ / 2.0 కలిగి ఉంటుంది మరియు వాటర్ డ్రాప్ నోచ్ లో ఉంటుంది. ఇది 64 జిబి మరియు 128 జిబి వంటి రెండు  స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది  మరియు మైక్రో ఎస్డి కార్డుతో 256 జిబి వరకూ పెంచవచ్చు. కనెక్టివిటీ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ అందించబడ్డాయి.

Realme 6i లో 5,000WAh బ్యాటరీ ఉంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ యొక్క కొలత 164.40×75.40×9.00 మిమీ మరియు దీని బరువు 195 గ్రాములు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :