రియల్ మీ నుండి Realme 6i స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ఎంట్రీ ఫోనుగా ఇండియాలో లాంచ్ అయింది. ఈ రియల్ మీ 6i ఫోన్ భారతదేశంలో వర్చువల్ లాంచ్ ఈవెంట్ ద్వారా ఆవిష్కరించబడింది మరియు ఇది మీడియాటెక్ గేమింగ్ ప్రాసెసర్, హై రిఫ్రెష్-రేట్ డిస్ప్లే మరియు వెనుక భాగంలో క్వాడ్ కెమెరా వంటి లేటెస్ట్ మరియు బెస్ట్ ఫీచర్లతో నిండి ఉంది. వాస్తవానికి, ఈ రియల్ మీ 6i ను 2020 మే నెలలో రియల్ మీ 6 s గా ప్రకటించారు, కాని కంపెనీ దీనిని భారతదేశంలో Realme 6i గా విక్రయించనుంది.
రియల్ మీ 6i ధర విషయానికి వస్తే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో బేస్ వేరియంట్ రూ .12,999 ధరతో ప్రకటించబడగా, 6 జీబీ / 64 జీబీ మోడల్ ధర భారతదేశంలో రూ .14,999 గా ఉంది. ఈ ఫోన్ రెండు రంగులలో వస్తుంది – లూనార్ వైట్ మరియు ఎక్లిప్స్ బ్లాక్.
రియల్ మీ 6i జూలై 31 నుండి ఫ్లిప్ కార్ట్ మరియు Realme India స్టోర్లలో అమ్మకానికి వస్తుంది.
రియల్ మీ 6i సెల్ఫీ కెమెరా కోసం ఎగువ-ఎడమ మూలలో పంచ్-హోల్ కటౌట్ కలిగిన ఒక 6.5-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ క్వాలిటీ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియో మరియు 90Hz హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లేను కలిగి ఉంది. సాధారణ ప్రమాధాల నుండి అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 3 పొరతో ఈ స్క్రీన్ సురక్షితం చేయబడింది.
ఈ ఫోన్ ను మీడియా టెక్ హెలియో జి 90 టి చిప్‌సెట్ ఆక్టా-కోర్ సిపియు మరియు మాలి-జి 76 జిపియు కలిగి ఉంది. ఇది 6GB RAM వరకు మరియు 64GB స్టోరేజ్ తో జతచేయబడుతుంది. అధనంగా, ఒక ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ ఉపయోగించి 256GB వరకు స్టోరేజ్ ను పెంచే ఎంపిక ఉంటుంది.
రియల్ మీ 6i వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, ప్రాధమిక 48 MP కెమెరా, 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూతో సెకండరీ 8 MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2 MP మాక్రో కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, 16MP సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్ లోపల ఉంది. వెనుక కెమెరాలు 4K UHD లో 30FPS వద్ద gyro-EIS సపోర్టుతో షూట్ చేయగలవు.
ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది మరియు 30W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-ది-బాక్స్ సపోర్ట్ తో 4,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.