లీకైన రియల్మీ 6 సిరీస్ నమూనా చిత్రాలు: భారీ ప్రత్యేకతలతో రానున్న ఫోన్లు

Updated on 27-Feb-2020
HIGHLIGHTS

సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

ఇండియాలో మార్చి 5 వ తేదికి తన తరువంటి తరం స్మార్ట్ ఫోన్లుగా 6 సిరీస్ నుండి Realme 6 మరియు Realme 6 Pro లను విడుదల చెయ్యడానికి అధికారికంగా డేట్ ని ప్రకటించింది. అయితే, ఆశ్చర్యకరంగా త్వరలో విడుదల కానున్న ఈ రియల్మీ 6 సిరీస్ నమూనా చిత్రాలు చైనా పాలపులర్ టిప్స్టర్ అయినటువంటి Weibo తన ప్లాట్ఫారం పైన Realme 6 Pro యొక్క నమూనా లీక్ చిత్రాలలను ప్రచురించింది.

ముందుగా ఈ వార్తను టెలికం టాక్ ప్రచురించింది. దీని ప్రకారం, ఈ ఫోన్ యొక్క కలర్ వేరియంట్స్ మరియు కెమేరా ఫీచర్లతో పాటుగా ప్రాసెసర్ గురించి కూడా వివరిస్తోంది. ఈ ప్రో వేరియంట్ రియల్మీ X 50 ప్రో మాదిరిగా మంచి డిజన్ తో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే, దీనిలో వెనుక నిలువుగా అమర్చిన కలుగు కెమేరాల సెటప్ మరియు ముందు డ్యూయల్ సెల్ఫీ కెమేరాలు కూడా ఉన్నట్లు చూపిస్తోంది. ముఖ్యంగా, ఈ ఫోనులో వెనుక ఎటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేకపోవడంతో, ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదా సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే, రెండర్ ఫోటోను క్షుణ్ణంగా పరిశీలిస్తే, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

ఇక ఇందులో ఇవ్వనున్న డిస్ప్లే గురించి కూడా వివరించింది. ఈ ప్రో వేరియంట్ FHD+ రిజల్యూషన్ అందించగల డిస్ప్లేని ఒక 90Hz రిఫ్రెష్ రేటుతో పాటుగా ఇవ్వనున్నట్లు చెబుతోంది. ఇక కెమేరాల విషయానికి వస్తే, వెనుక లోక ప్రధాన 64MP ప్రో కెమెరా గల క్వాడ్ కెమేరా సెటప్ తో అందించనుంది. అధనంగా, ఈ కెమేరా సెటప్పుతో 20X జూమ్ ఫీచర్ ని కూడా కలిగి ఉన్నట్లు ప్రకటిస్తోంది. ఇది స్నాప్ డ్రాగన్ 720G SoC, 30W ఫ్లాష్ చార్జర్ వంటి గొప్ప ఫీచర్లతో రావచ్చని ఈ లీకైన రెండర్ల ద్వారా అంచనా వేస్తున్నారు.                                                       

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :