రియల్మీ 5s VS వివో U 20 VS రెడ్మి నోట్ 8 : మద్య సరిపోలిక

HIGHLIGHTS

తులనాత్మక వివరణ

ప్రస్తుతం, మార్కెట్లో కేవలం 10, రుపాయల ధరలో అన్ని ప్రత్యేకతలు కలిగిన ఫోనుగా అందరి మన్ననలను అందుకున్న, రెడ్మి నోట్ 8 మరియు బడ్జెట్ ధరలో వెనుక నాలుగు కెమేరాలతో పాటుగా ఒక 48MP ప్రధాన కెమేరా మరియు మరిన్ని ప్రత్యేకతతో వచ్చిన Realme 5s మరియు స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, అల్ట్రా గేమింగ్ మోడ్ మరియు వెనుక ఒక ట్రిపుల్ కెమేరాతో కొంచం ఎక్కువ దరలో వచ్చిన వివో U20 ఫోన్ల మధ్య తులనాత్మక వివరణతో మీకు ఎటువంటి ఫోన్ సరిగా ఉంటుందో తెలుసుకుందాం.

డిస్ప్లే

Realme 5s స్మార్ట్ ఫోన్, ఒక 6.5 అంగుళాల HD+ రిజల్యూషన్ అందించగల మినీ డ్రాప్ డిజైన్ డిస్ప్లేతో వస్తుంది. ఈ అతి చిన్నని నోచ్ డిజైనులో ఒక సెల్ఫీ కెమేరాని ఇందులో అందించింది. ఈ స్మార్ట్ఫోన్ 89 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. ఈ వివో యు 20 ఒక పెద్ద 6.35-అంగుళాల FHD + ఐపిఎస్ డిస్ప్లే మరియు పాండా mn228 గ్లాస్ రక్షణతో వస్తుంది. ఇది 2340×1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందిస్తుంది. రెడ్మి నోట్ 8 ఒక 6.3-అంగుళాల స్క్రీనుతో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ తో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో కూడా ఇది గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. ఈ విభాగంలో, రెడ్మి నోట్ 8 మరియు VIVO U20 ఫోన్లదే  పైచేయిగా చెప్పొచ్చు.  కంటెంట్ ఎక్కువగా చూసే వారికీ ఈ డిస్ప్లే బాగుంటుంది.

ప్రాసెసర్, ర్యామ్ మరియు స్టోరేజి:

ఈ వివో U20 స్మార్ట్ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675AIE ప్రాసెసర్తో పనిచేస్తుంది మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి, ఈ ఫోన్ అల్ట్రా గేమ్ మోడ్ను కూడా కలిగి ఉంటుంది. దీనికి జతగా, 4GB/6GB  ర్యామ్ మరియు 64GB  స్టోరేజితో ఎంచుకోవచ్చు. రియల్మీ 5S స్మార్ట్ ఫోన్, ఒక స్నాప్డ్రాగెన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసరుతో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా, 2.0GHz వరకు క్లాక్ స్పీడును అందిస్తుంది దీని జతగా 4GB మరియు 64GB /128GB స్టోరేజి ఎంపికలతో ఎంచుకోవచ్చు.  అలాగే, రెడ్మి నోట్ 8 లో కూడా 2.0Ghz క్లాక్ స్పీడ్ అందించగల ఒక స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ చిప్ సెట్ ని అందించారు. దీనికి జతగా, ఒక 4GB/6GB  ర్యామ్ మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజి ఎంపికలతో వస్తుంది. ఈ విభాగంలో, మిగిలిన రెండు స్మార్ట్ ఫోన్లు రెండింటి కంటే  కూడా,  స్పీడ్ మరియు ప్రాసెసింగ్ పరంగా U 20 కొంచెం అధికంగా ఉంటుందని చెపొచ్చు. 

వెనుక కెమేరా :

REALME 5S  స్మార్ట్ ఫోను యొక్క వెనుక భాగంలో ఒక క్వాడ్ కెమేరా సెటప్పును  అందించింది. ఒక ప్రధాన 48MP (samsung GM1) కెమేరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా ఇందులో ఇవ్వబడింది. అలాగే, ఇది 8MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కి జతగా 2MP మాక్రో కెమేరా కలిగి ఉంది. ఈ కెమెరాలో అందించిన కెమేరాతో 10X డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. రెడ్మి నోట్ 8 విషయానికి వస్తే, ఈ మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  48 MP(samsung GM1) సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక 2MP డెప్త్ సెన్సార్ మరియు  ఒక 2MP మాక్రో సెన్సారుతో కెమెరాను అందించింది.ఇక చివరిగా U20 విషయానికి వస్తే,  వెనుక భాగంలో AI ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 16 MP ప్రాధమిక కెమెరా మరియు దానికి జతగా ఒక 8 MP వైడ్ యాంగిల్ కెమెరా మరియు మూడవదిగా  2 MP  మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ విభాగంలో రియల్మీ 5s మరియు రెడ్మి నోట్ 8 ఫోన్లు కొంచం అధికంగా నిలుస్తాయి. అయితే, ఇక్కడ వివరణ కేవలం మ్యాక్రో కెమెరాను గురించి మాత్రమే ఇవ్వబడింది.

సెల్ఫీ కెమేరా

ముందు కెమెరా విషయానికి వస్తే, రియల్మీ 5s వోనులో ముందు 13 MP  సెల్ఫీ కెమేరాతో వస్తుంది. అదే రెడ్మి నోట్ 8 విషయానికి వస్తే, ఈ ఫోన్లో కూడా 13MP సెల్ఫీ కెమెరాను పొందుతారు. ఇక వివో U 20  విషయానికి వస్తే, ఈ ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. ఈ విభాగంలో వివో U 20 ఏకగ్రీవంగా నిలుస్తుంది.

బ్యాటరీ & చార్జర్ టెక్నాలజీ

రియల్మీ 5S  లో ఒక 10 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ కలిగిన 5000 mAh బ్యాటరీతో వస్తుంది. రెడ్మి నోట్ 8 మాత్రం, ఒక 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని ఇచ్చింది. కానీ, ఇది 18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా బాక్స్ లోనే ఒక 18W చార్జరుతో వస్తుంది. వివో U 20 మాత్రం, ఒక 5,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని ఒక 18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా బాక్స్ లోనే ఒక 18W చార్జరుతో ఇచ్చింది.

OS

రియల్మీ 5S స్మార్ట్ ఫోన్ కలర్ OS 6 స్కిన్ తో ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది. రెడ్మి నోట్ 8 తన సొంత MIUI 10 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 9 ఫై  ఆధారితంగా నడుస్తుంది. U 20  ఫోన్, ఆండ్రాయిడ్ 9 పై ఆధారితంగా Funtouch OS 9.2 స్కిన్ పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :