భారీ 5,000mAh బ్యాటరీతో Realme 5i స్మార్ట్ ఫోన్ జనవరి 9 న విడుదలకానుంది

Updated on 06-Jan-2020
HIGHLIGHTS

ఒక భారీ 5,000 బ్యాటరీ ,మరియు క్వాడ్ రియర్ కెమేరాతో లాంచ్ అవనునట్లు చెబుతోంది.

2019 ముగిసే వారం ముందు, రెండు కొత్త రియల్మి స్మార్ట్‌ ఫోన్లను లాంచ్ చేయనున్నదని అనేక రూమర్లు ఆన్లైన్లో వచ్చాయి. అయితే, ఈ రోజు తన ట్విట్టర్ ఖాతాలో  అందించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ద్వారా రియల్మీ తన Realme 5i స్మార్ట్ ఫోన్ను ఇండియాలో లాంచ్ చేయనునట్లు తెలిపింది. ముందుగా వచ్చిన నివేదికల ప్రకారంగా మరియు దీని పేరును బట్టి చూస్తే, ఈ స్మార్ట్ ఫోన్ సంస్థ నుండి బడ్జెట్ ధరలో విడుదల కావచ్చని సూచిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ను జనవరి 9 వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకి ఇండియాలో లాంచ్ చేయడానికి తేదీని ఖరారు చేసినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.    

ఇక ట్విట్టర్‌లో సంస్థ  అందించిన టీజర్ పోస్టర్ పరిశీలిస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక నాలుగు అంటే క్వాడ్ కెమేరా సేటప్పుతో రానున్నట్లు అర్ధమవుతోంది. వాస్తవానికి, realme యొక్క 5 సిరీస్ నుండి వచ్చినటువంటి అన్ని స్మార్ట్ ఫోన్లు కూడా వెనుక క్వాడ్ కెమేరా సెటప్పుతో వచ్చినవే అని మనకు తెలుసు. అంతేకాదు, ఇది నాన్ 5 జి స్మార్ట్‌ ఫోన్ అని కూడా ముందు నివేదిక సూచిస్తుంది. అయితే, Flipkart తన ఆన్లైన్లో ప్లాట్ఫారం పైన ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ ని కూడా అందించింది. ఇందులో, ఈ స్మార్ట్ ఫోన్, ఒక  భారీ 5,000 బ్యాటరీ ,మరియు క్వాడ్ రియర్ కెమేరాతో లాంచ్ అవనునట్లు చెబుతోంది.     

రియల్మి 5i మోడల్ నంబర్ ‘RMX2030’ తో జాబితా చేయబడింది, ఇది వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ వెబ్‌ సైట్‌ లో ఈ నెల ప్రారంభంలో చూసిన అదే సంఖ్య. రియల్మి 5i LTE కి మద్దతు ఇస్తుందని పేర్కొంది. అయితే, కంపెనీ ఇప్పటికే రియల్మి 5 సిరీస్‌ నుండి రియల్మి 5, రియల్మి 5 ప్రో మరియు రియల్మీ 5s లను కలిగి ఉంది. రియల్మి 5i గతంలో లాంచ్ చేసిన రియల్మే 5s యొక్క కొంచెం బంప్ అప్ వెర్షన్ కావచ్చు. రియల్మీ, తన ఈ రియల్మి 5i తో ధర అంతరాన్ని పూరించడానికి చూడవచ్చు లేదా ఇది రియల్మి 5s యొక్క స్థానాన్ని భర్తీ చేస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :