రియల్మీ 3 వచ్చేస్తొందోచ్

రియల్మీ 3 వచ్చేస్తొందోచ్
HIGHLIGHTS

ట్విట్టర్ లో టీజర్స్ మొదలుపెట్టిన రియల్మీ

 రియల్మీ 3 త్వరలో మార్కెట్ ని తాకనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, రియల్మీ త్వరలో తీసుకురానున్న ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గురించి సోషల్ మీడియాలో టీజ్ చేయడం ఇప్పటికే మొదలుపెట్టేసింది. ఈ కంపెనీ, తన అధికారిక ట్విట్టర్ పేజీలో దీని గురించి తాజాగా ఒక టీజ్ అందించింది. ప్రస్తుతం, త్వరలో షావోమి నుండి ఇండియాలో విడుదలకానున్న రెడ్మి నోట్ 7 ని దృష్టిలో ఉంచుకుని ముందునుండే దీని కోసం ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే, ఫిబ్రవరి 28 న ఇండియాలో విడుదలకానున్న రెడ్మి నోట్ 7 మాదిరిగానే, రియల్మీ 3 కూడా ఒక 48MP రియర్ కెమేరాతో అంచనా వేస్తున్నారు కాబట్టి.

ఈ ట్వీట్ లో, త్వరలో రానున్న  ఈ స్మార్ట్  ఫోన్ గురించి మాధవ్ సేథ్ " రియల్మీ1+ రియల్మీ2 = బెస్ట్ పవర్ అండ్ బెస్ట్ స్టైల్ ఇన్ ది సేమ్ సెగ్మెంట్ " అని వ్రాసారు. ఈ ట్వీట్ మనకు ఏమిచెబుతుందంటే,  రియల్మీ1 మరియు రియల్మీ2 మదిరిగానే రియల్మీ3 కూడా బడ్జెట్ ధరలో రానున్నట్లు తెలుస్తోంది. ఈ రియల్మీ3, గురించి ఎక్కువగా వివరాలు ఇప్పటికి తెలియనప్పటికీ, ఒక 48MP రియర్ కెమేరాతో ఇండియాలో విడుదలకానున్న రెడ్మి నోట్ 7 స్మార్ట్ ఫోనుకు పోటీగా ఉండేటట్లు మాత్రం తెలుస్తోంది. అలాగే, తన ట్రెడిషన్ అయినటువంటి ఒక పెద్ద బ్యాటరీతో ఉంటుంది.

గత సంవత్సరంలో, రియల్మీ కూడా షావోమి వంటి ఫ్లాష్ సేల్ మోడ్స్ ఉపయోగించింది.అలాగే, రియల్మీ2 యొక్క 3.2 లక్షల యూనిట్లను కేవలం ఒక్క మొదటి సేల్ నుండి విక్రయించినట్లు, రియల్మీ ఒక ప్రకటనలో తెలిపింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, మిగిలిన బ్రాండ్స్ కంటే భిన్నంగా మార్కెట్లోకి ప్రవేశించిన అతి కొద్దికాలంనే, 4 మిలియన్ వినియోగదారులతో, భారతదేశంలో Q4 2018 నాటికీ వున్నా టాప్ 5 స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ లో స్థానాన్ని ఆక్రమించింది.                  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo