మీరు రియల్మి 3 ప్రో యూజర్ అయితే, మీ కోసమే ఈ శుభవార్త. ఈ స్మార్ట్ ఫోన్, ఇప్పుడు మార్చి 2020 OTA అప్డేట్ ను స్వీకరించడం ప్రారంభించింది. ఈ అప్డేట్ వెర్షన్ RMX1851EX_11.C.04. మీకు ఇంకా ఈ అప్డేట్ అందకపోయినా చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే, రియల్మి3 ప్రో కోసం ఈ అప్డేట్ దశలవారీగా పంపిణీ చేయబడుతోంది. దీని గురించిన రియల్మి పోస్ట్ ఇలా ఉంది, “ఈ అప్డేట్ యొక్క స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, ఇది దశలవారీగా ఉంటుంది. ఈ అప్డేట్ మార్చి 23, 2020 నుండి పరిమిత సంఖ్యలో వినియోగదారులకు యాదృచ్చికంగా నెట్టివేయబడుతుంది మరియు ఎటువంటి క్లిష్టమైన దోషాలు లేవని నిర్ధారించుకున్న కొద్ది రోజుల్లో అందరికి రోల్ అవుట్ చెయ్యబడుతుంది. క్లిష్టమైన దోషాలు ఏవీ కనుగొనబడకపోతే, రాబోయే రోజుల్లో పూర్తి రోల్ అవుట్ పూర్తవుతుంది. ”
ఇక క్రొత్త లక్షణాలకు(ఫీచర్లకు) సంబంధించినంతవరకూ, ఈ అప్డేట్ లో ఏదీ లేదు. ఈ అప్డేట్ రియల్మి 3 ప్రో లో వున్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించబడింది. ఈ అప్డేట్, దానితో మార్చి 2020 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ మరియు పరిష్కారాలను అందిస్తుంది. ఈ అప్డేట్ తో వచ్చే పరిష్కారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.