రియల్మీ3 లాంచ్ డేట్ సెట్ : హీలియో P70 SoC మరియు 4230 mAh బ్యాటరీతో విడుదల చేయబడుతుంది.

Updated on 02-Mar-2019
HIGHLIGHTS

ఈ ఫోన్ యొక్క ఈ స్పెక్స్ గురించి ఫ్లిప్ కార్ట్ ఒక వెబ్ పేజీలో వెల్లడించింది.

రియల్మీ3 స్మార్ట్ ఫోన్ను మార్చి 4 న విడుదలచేయనున్నట్లు డేట్ సెట్ చేసిన రియల్మీ. కంపెనీ మరియు దాని CEO, మాధవ్ షీత్, రాబోయే డివైజ్ గురించి  హైప్ సృష్టించడానికి ఎటువంటి అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఇక ఆన్లైన్ ప్లాట్ఫామ్ పైన ఎక్స్క్లూజివ్స్ లేనప్పటికీ, ఫ్లిప్ కార్ట్ మాత్రం రాబోయే ఫోన్ కోసం ఒక ప్రత్యేక మైక్రోసాట్ను నిర్వహిస్తుంది, ఇది ఆన్లైన్ రిటైలర్ ద్వారా అందుబాటులో ఉంటుంది అని సూచిస్తుంది. అదనంగా, ఈ కొత్త వెబ్ పేజీ అధికారికంగా ఫోన్ రావడానికంటే   ముందుగానే  హ్యాండ్సెట్ యొక్క కొన్ని కీలకమైన వివరాలను వెల్లడిస్తుంది. Relme ఇటీవలే ప్రారంభించిన Redmi Note 7 Pro మరియు Redmi Note 7 స్మార్ట్ ఫోన్ల పని తీసుకున్నట్లు తెలుస్తోంది, Realme 3 పోటీకి "# 3StepsAhead" అని చూపించబడుతోంది.

Flipkart వెబ్ పేజ్, రియల్మి 3 ను ఒక 12 nm ఉత్పాదక విధానంలో నిర్మించిన మీడియా టెక్ హీలియో P70 ప్రాసెసర్ తో ఉన్నట్లు చెబుతోంది. ఈ హీలియో P70 ఒక 14nm ప్రాసెసరుతో పోల్చబడింది, ఇది రెడ్మి నోట్ 7 లో ఉపయోగించిన 14nm స్నాప్ డ్రాగన్ 660 గురించి వివరిస్తునట్లు కనిపిస్తుంది. రియల్మి3 లో డ్యూ – డ్రాప్ నోచ్ డిస్ప్లే డిజైన్, ఒక 4230 mAh బ్యాటరీతో ఉన్నట్లు కూడా ఈ టీజర్ పేజీ నిర్ధారించింది.  దీని బ్యాటరీ గురించి మరొకసారి సరిపోలిక చేసింది, అంటే  'చిన్న బ్యాటరీల' తో పోల్చబడింది, ఇది రెడ్మి  నోట్ 7 సిరీసులో ఉపయోగించిన 4,000mAh బ్యాటరీకి సూచనగా చెప్పవచ్చు. రియల్మి3 స్మార్ట్ఫోన్ మార్చి 4 న 12:30 గంటలకు ప్రారంభించబడుతుందని కూడా ఇది వివరిస్తోంది.

 Realme నుండి రాబోయే Realme 3 స్మార్ట్ఫోన్ గురించి మొత్తం అధికారిక సమాచారాన్ని వెల్లడించింది. అయినప్పటికీ, ఈ ఫోన్ యొక్కప్రో వేరియంట్ కూడా స్టాండర్డ్ వేరియంట్ తో పాటుగా ప్రకటించబడుతుంది మరియు ఒక టీజర్ వీడియో ద్వారా వీటిని చూపించవచ్చు, ఇది వేగవంతమైన ఛార్జింగ్ కి  మద్దతుతో వస్తుంది.  ఇటీవలే, రియర్ ప్యానల్ కోసం డైమండ్-కట్ డిజైన్తోపాటు, డ్యూయల్ -వెనుక కెమెరా మరియు వెనుకవైపు మౌంట్ చేయబడిన వేలిముద్ర సెన్సార్ను కలిగి ఉండనున్నట్లు, ధ్రువీకరించబడింది.

ఇవన్నీ చూస్తుంటే, మధ్య శ్రేణి స్మార్ట్ ఫోన్ విభాగంలో పోటీ రోజురోజుకు వేడెక్కుతోంది. షావోమి పరిచయం చేసిన రెడ్మి నోట్ 7 సిరీస్, తక్కువ ధర వద్ద అప్డేటెడ్  స్పెక్స్ మరియు ఫీచర్లతో వస్తుంది. ఇక  రియల్మి , ఆసుస్, మరియు హానర్ వంటి పోటీ బ్రాండ్లు వారి వ్యూహాలను ఎలా రూపొందిస్తాయో వేచి చూడాలి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :