Realme 200MP కెమేరా ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

రియల్ మీ తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ గురించి ప్రకటించింది

200MP కెమేరా తో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కూడా కంపెనీ ప్రకటించింది

Realme 200MP కెమేరా ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతోంది.!

రియల్ మీ తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ గురించి ప్రకటించింది. అదే, Realme 11 Series 5G మరియు ఈ సిరీస్ నుండి 200MP కెమేరా తో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కూడా కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే, రియల్ మి 11 సిరీస్ 5జి స్మార్ట్ ఫోన్ల గురించి కంపెనీ టీజింగ్ మొదలు పెట్టింది మరియు ఈ ఫోన్ల గురించి ఫ్లిప్ కార్ట్ కూడా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ మొదలు పెట్టింది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రియల్ మి ఇండియాలో లాంచ్ చేయబోయినట్లు ప్రకటించిన ఈ 11 సిరీస్ 5G ఫోన్లు ముందుగా చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ 11 సిరీస్ 5జి నుండి రెండు ఫోన్లను రియల్ మి చైనాలో లాంచ్ చేసింది. వీటిలో రియల్ మి 11 ప్రో+ 5G స్మార్ట్ ఫోన్ 200MP (OIS) కెమేరాతో వచ్చింది మరియు ఈ ఫోన్ భారీ ఫీచర్లను కూడా కలిగి వుంది. 

ఇప్పుడు ఇండియాలో విడుదల చెయ్యనున్న 11 సిరీస్ ఫోన్లలో కూడా 200MP కెమేరా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. అంటే,ఈ ఫోన్ చైనాలో విడుదల చేసిన అదే Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రియల్ మి 11 సిరీస్ ఫోన్స్ లాంచ్ కోసం అందించిన టీజర్ పేజ్ నుండి ఫోన్ డిజైన్ ను కూడా కంపెనీ అందించింది. ఈ డిజైన్ కూడా ఈ ఫోన్ అదే అవుతుందని అనిపించేలా కనిపిస్తోంది. 

టీజింగ్ పేజ్ ద్వారా అందించిన ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక ప్రీమియం లెథర్ బ్యాక్ ను మధ్యలో జిప్ మాదిరిగా కనిపించే స్ట్రిప్ తో కలిగి వుంది. అంతేకాదు, ఫోన్ పై భాగం మధ్యలో పెద్ద కెమేరా మోడ్యూల్ కూడా వుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ ను రియల్ మి ఇంకా ప్రకటించ లేదు. కాబట్టి, ఈ ఫోన్ లాంచ్ నాటికి అన్ని ప్రధాన స్పెక్స్ మరియు ఫీచర్లను కంపెనీ టీజింగ్ పేజ్ ద్వారా ప్రకటించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo