Realme 16 Pro Plus camera features revealed
Realme 16 Pro Plus స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్స్ ఈరోజు రియల్‌మీ రివీల్ చేసింది. రియల్‌మీ 16 ప్రో సిరీస్ నుంచి లాంచ్ చేస్తున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ వివరాలు విడుదల చేసింది. ఈ ఫోన్ ను ప్రీమియం గ్రేడ్ కెమెరా ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నట్లు, ఈ ఫోన్ టీజర్ నుంచి రియల్‌మీ వెల్లడించింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ డిజైన్ మరియు ఇతర వివరాలు కూడా రియల్‌మీ బయటకు వెల్లడించింది.
రియల్‌మీ 16 ప్రో సిరీస్ ఇండియాలో వచ్చే నెల లాంచ్ అవుతుంది. ఈ సిరీస్ ను 2025 జనవరి 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ గురించి టీజింగ్ చేస్తోంది.
రియల్‌మీ 16 ప్రో ప్లస్ ఫోన్ గొప్ప కెమెరా సెటప్ తో లాంచ్ అవుతున్నట్లు రియల్‌మీ తెలిపింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 200MP ప్రధాన కెమెరా మరియు జతగా 50MP పెరిస్కోప్ టెలీ ఫోటో కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ అన్ని జూమ్ ఫార్మాట్ లో కూడా పర్ఫెక్ట్ పోర్ట్రైట్ ఫోటోలు అందిస్తుందని రియల్‌మీ చెబుతోంది. ఈ ఫోన్ గరిష్టంగా 120x సూపర్ జూమ్ సపోర్ట్ టి ఉంటుందని కూడా రియల్‌మీ తెలిపింది.
ఇక ఈ ఫోన్ కెమెరా అదనపు ఫీచర్లు విషయానికి వస్తే, ఈ ఫోన్ కొత్త Luma Color అల్గారిథం సపోర్ట్ తో ఉంటుంది. ఇది లైటింగ్ తక్కువగా ఉండే రాత్రి సమయాల్లో తేజ్ ఫోటోలకు సరికొత్త సొబగులు అద్దుతుంది. ఇందులో 3D ఫోటాన్ మాట్రిక్స్, 16 బిట్ RAW డొమైన్ కంప్యూట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కెమెరా ఫీచర్స్ తో ఈ ఫోన్ సూపర్ క్వాలిటీ ఫోటోలు అందిస్తుందని రియల్‌మీ చెబుతోంది. ఈ ఫోన్ 4K HDR వీడియో సపోర్ట్ తో సినిమాటిక్ జామ్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుందట.
Also Read: 22 వేల ధరలో బెస్ట్ 50 ఇంచ్ Smart TV డీల్ కోసం చూస్తున్నారా.!
ఈ ఫోన్ కలిగిన అదనపు కెమెరా ఫీచర్ చూస్తే, ఈ ఫోన్ ఎఐ ఎడిట్ జీని 2.0 మరియు ఎఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇలా ఈ ఫోన్ టన్నుల కొద్ది కెమెరా ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది. ఇక డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ అర్బన్ వైల్డ్ డిజైన్ తో ఉంటుంది. ఇది చాలా స్లీక్ గా ఉంటుంది మరియు ముందు వెనుక కూడా కర్వ్డ్ డిజైన్ తో ఉంటుంది.