Realme 16 5G: ఫస్ట్ సెల్ఫీ మిర్రర్ ఫోన్ గా లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Realme 16 5G లాంచ్ అనౌన్స్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఫస్ట్ సెల్ఫీ మిర్రర్ ఫోన్ గా లాంచ్ అవుతోందని రియల్ మీ తెలిపింది

ఎన్నడూ చూడని కొత్త డిజైన్ తో కూడా లాంచ్ అవుతుంది

Realme 16 5G: రియల్ మీ ఇండియాలో విడుదల చేయబోతున్న తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఫస్ట్ సెల్ఫీ మిర్రర్ ఫోన్ గా లాంచ్ అవుతోందని రియల్ మీ తెలిపింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ లలో ఎన్నడూ చూడని కొత్త డిజైన్ తో కూడా లాంచ్ అవుతుంది.

Realme 16 5G: లాంచ్ డేట్

రియల్ మీ 16 ఫైవ్ స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ అవుతుందని కంపెనీ అనౌన్స్ చేసింది. అయితే, అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Realme 16 5G: కీలక ఫీచర్స్

రియల్ మీ 16 స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ మొదలుపెట్టిన రియల్ మీ, ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా రివీల్ చేసింది. ఈ టీజర్ నుంచి ఈ అప్ కమింగ్ ప్రత్యేకమైన ఫీచర్ గురించి వెల్లడించింది. ఈ ఫోన్ ను ఫస్ట్ సెల్ఫీ మిర్రర్ ఫోను గా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ లో వెనుక ఉన్న రియర్ కెమెరాతో జతగా ఒక ప్రత్యేకమైన మిర్రర్ (అద్దం) ఉన్నట్లు టీజర్ ఇమేజ్ లో చూపించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో పైన అడ్డంగా ఉన్న కెమెరా బార్ ను అందించింది.

ఈ ఫోన్ ను సరికొత్త ఎయిర్ డిజైన్ తో తో లాంచ్ చేస్తోంది. ఇందులో వెనుక మెరిసే రెక్కల వంటి డిజైన్ ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 6.57 ఇంచ్ కాంపాక్ట్ స్క్రీన్ ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :